Camel: ఒంటె కన్నీటితో పాము కాటుకు విరుగుడు.. ఇవిగో వివరాలు

ఏటా ఈ పాము కాటు వల్ల 1.25 లక్షల మంది చనిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పాము కాటు వల్ల మనిషి చనిపోయే పరిస్థితులు రాకుండా విరుగుడు మందు తయారీ కోసం చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దుబాయ్‌లోని సీవీఆర్ఎల్ (సెంట్రల్ వెటర్నరీ లాబోరేటరీ) ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది.

Camel: ఒంటె కన్నీటితో పాము కాటుకు విరుగుడు.. ఇవిగో వివరాలు
Camel Tears
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 21, 2024 | 5:53 PM

సాధారణంగా పాములన్నీ విషపూరితాలు కావు. కొన్ని మాత్రమే అత్యంత ప్రమాదకరమైనవి. కట్ల పాము, రక్త పింజర, తాచుపాము వంటివి  కాటు వేసినప్పుడు నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే మెడిసిన్ తయారీకి నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా పాముకాటుతో లక్షలమంది చనిపోతూనే ఉన్నారు. తాజాగా పాముకాటుకు ఒంటె కన్నీరుతో ఔషధాన్ని తయారుచేసేందుకు సిద్ధమయ్యారు దుబాయ్‌ శాస్త్రవేత్తలు.

ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు స్పీడ్‌గా సాగుతున్నాయి. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. ఈ ల్యాబ్‌లో ఒంటెన్నీరుపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా కొనసాగించలేకపోయారు. తాజాగా ఫండ్స్ సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని CVRL తెలిపింది. త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే మెడిసిన్ తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం చీఫ్ డాక్టర్ వార్నర్ వెల్లడించారు.

ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు, లైసోజైమ్‌లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తాయి. ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, భారత్, తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.  వీరి పరిశోధనలు ఫలించి ఔషధాన్ని మార్కెట్‌లోకి తెస్తే పాము కాటు మరణాలు చాలా వరకు అరికట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం