AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Booking: రైలు టిక్కెట్‌ను ఇతరుల పేరుపై బదిలీ చేయవచ్చా? ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే సాధ్యమే..!

రైల్వే స్టేషన్స్‌ వద్ద క్యూలైన్స్‌కు చెక్‌ పెట్టేందుకు తీసుకొచ్చిన ఈ-టిక్కెటింగ్‌ విధానం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఒకరి టిక్కెట్‌పై వేరొకరు ప్రయాణించవచ్చా? అనేది చాలా మందికి పెద్ద అనుమానంగా ఉంటుంది. ఇటీవల భారతీయ రైల్వే ఇ-టికెట్‌ను బుక్ చేసి, పొరపాటు కారణంగా ప్రయాణీకుడి పేరును మార్చాల్సి వస్తే లేదా కుటుంబ సభ్యుల పేరు తప్పుగా నమోదు చేస్తే సాంకేతికత దిద్దుబాటు ప్రక్రియను సులభతరం చేసింది.

IRCTC Booking: రైలు టిక్కెట్‌ను ఇతరుల పేరుపై బదిలీ చేయవచ్చా? ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే సాధ్యమే..!
Indian Railways
Nikhil
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 17, 2024 | 10:15 AM

Share

భారతదేశంలో రైలు ప్రయాణం చాలా మందికి చవకైన రవాణా సాధనం. అయితే పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా రైల్వేల్లో కూడా గణీయమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్స్‌ వద్ద క్యూలైన్స్‌కు చెక్‌ పెట్టేందుకు తీసుకొచ్చిన ఈ-టిక్కెటింగ్‌ విధానం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఒకరి టిక్కెట్‌పై వేరొకరు ప్రయాణించవచ్చా? అనేది చాలా మందికి పెద్ద అనుమానంగా ఉంటుంది. ఇటీవల భారతీయ రైల్వే ఇ-టికెట్‌ను బుక్ చేసి, పొరపాటు కారణంగా ప్రయాణీకుడి పేరును మార్చాల్సి వస్తే లేదా కుటుంబ సభ్యుల పేరు తప్పుగా నమోదు చేస్తే సాంకేతికత దిద్దుబాటు ప్రక్రియను సులభతరం చేసింది. ఈ సేవకు సంబంధించి ఐఆర్‌సీటీస వెబ్‌సైట్‌లో టిక్కెట్లను బుక్ చేస్తున్నప్పుడు ఎర్రర్లను ఎదుర్కొన్నా లేదా మీ కుటుంబంలో బుక్ చేసిన టిక్కెట్ను బదిలీ చేయాలనుకున్నా ఇటీవల ఐఆర్‌సీటీసీ ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. అదేంటో ఓసారి తెలుసుకుందాం. 

ప్రయాణికుల పేరు మార్పు ఇలా

  • బుక్‌ చేసిన టిక్కెట్‌లో పేరు మార్చడానికి ఐఆర్‌సీటీ ఈ-టికెట్, సరైన ఆధారాలతో మీ ఐఆర్‌సీటీసీ ఖాతాలోకి లాగిన్ చేయడం ద్వారా ప్రారంచాలి. బోర్డింగ్ పాయింట్, ప్యాసింజర్ పేరు మార్చే అవకాశం ఉంటుంది. దీని కోసం ఫారమ్ లింక్‌ను నావిగేట్ చేయాలి. అవసరమైన ఫీల్డ్‌లను కచ్చితంగా పూర్తి చేసి, నింపిన ఫారమ్‌ను అప్లోడ్ చేయాలి. కాబట్టి టిక్కెట్‌లో పేరు మార్పు ఎలా చేయాలో? దశల వారీగా చూద్దాం.
  • టికెట్ ప్రింట్ అవుట్ తీసుకోండి
  • మీ సమీప రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. టికెట్లో ప్రయాణించే ఎవరైనా ప్రయాణీకుల ఒరిజినల్ ఐడి ప్రూఫ్‌తో పాటు దాని ఫోటోకాపీని తీసుకెళ్లాలి. అనంతరం మీరు ప్రయాణీకుడి పేరును మార్చమని కౌంటర్ అధికారిని అడగవచ్చు
  • అయితే ఈ సదుపాయాన్ని పొందేందుకు మీరు రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు రిజర్వేషన్ కార్యాలయాన్ని సందర్శించాలి. 

మీ టిక్కెట్టును మీ కుటుంబంలోని మరొకరికి ఎలా బదిలీ చేయడం ఇలా 

ఐఆర్‌సీటీ ప్రయాణీకులు తమ టిక్కెట్లను తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త లేదా భార్యతో సహా కుటుంబ సభ్యునికి బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ప్రయాణికులు ఈ సాధారణ దశలను అనుసరించాలి టికెట్‌కు సంబంధించినప ప్రింట్‌ అవుట్‌ను, ప్రస్తుత ప్రయాణీకుల అసలు ఐడీ రుజువును సమర్పించాలి. రిజర్వేషన్ డెస్క్ వద్ద కొత్త ప్రయాణికుడితో రక్త సంబంధానికి సంబంధించిన రుజువును అందించాలి. ఈ సరళమైన విధానం ఐఆర్‌సీటీసీ సేవలకు అనుకూలమైన ఫీచర్‌ను జోడిస్తూ, కుటుంబంలో టిక్కెట్లను సజావుగా బదిలీ చేయవచ్చు. 

కన్‌ఫామ్‌ అయిన టిక్కెట్ల బదిలీ

మీ టిక్కెట్ను బదిలీ చేయడానికి మీరు రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందుగా మీ అభ్యర్థనను సమర్పించాలి. అయితే రాయితీపై జారీ చేసిన టిక్కెట్లపై పేర్ల మార్పు అనుమతించరు.

ఇవి కూడా చదవండి

టిక్కెట్‌ ట్రాన్స్‌ఫర్‌ నియమాలు

బదిలీ అంటే రైల్వే సర్వెంట్‌కు సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని మార్చడం. అలాగే  బదిలీ తాత్కాలికమైనప్పుడు బదిలీ ఆర్డర్లో అదే పేర్కొనాలి. అటువంటి సందర్భాల్లో ఉద్యోగి 180 రోజుల వ్యవధిలో టీఏ/డీఏకు అర్హులు, ఆ తర్వాత బదిలీ శాశ్వతంగా మారుతుంది.

రైల్వే టిక్కెట్లో మార్పులు చేయవచ్చా?

మీరు ఐఆర్‌సీటీసీ నుంచి నిర్ధారణను స్వీకరించిన తర్వాత,  మీరు మీ టిక్కెట్‌కుఅవసరమైన మార్పులను చేయవచ్చు. ఇది ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా కస్టమర్ కేర్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా చేయవచ్చు. మార్పులు చేయడానికి మీరు మీ టిక్కెట్ నంబర్, నిర్ధారణ ఈ-మెయిల్‌ను అందించాలి. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..