AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుహలో దాగివున్న మిలియన్ల సంవత్సరాల నిధి.. 7 కాదు 27 తరాలు తినేంత..! ఇంకా ఎవరు తీసుకోలేదు..?

2000 సంవత్సరంలో శాస్త్రవేత్తలు దీని గురించి తెలుసుకున్నప్పుడు, వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తవ్వకాలలో పర్వతం కింద ఇప్పటివరకు కనిపించని అద్భుతమైన దృశ్యం కనిపించింది.. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ స్ఫటికాలు ఒక రకమైన ఖనిజమైన జిప్సంతో తయారైనట్టుగా గుర్తించారు. ఇది కాగితం, వస్త్ర పరిశ్రమలలో పూరకంగా ఉపయోగించబడుతుంది. భవనాల తయారీకి సిమెంట్‌లో కూడా ఉపయోగిస్తారు. ఈ గుహలోని స్ఫటిక స్తంభాలు 5 లక్షల సంవత్సరాలకు పైగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఈ స్థలాన్ని సందర్శించడం అసాధ్యం.

గుహలో దాగివున్న మిలియన్ల సంవత్సరాల నిధి.. 7 కాదు 27 తరాలు తినేంత..! ఇంకా ఎవరు తీసుకోలేదు..?
Treasure Hidden
Jyothi Gadda
|

Updated on: Jan 17, 2024 | 8:45 AM

Share

ప్రపంచంలో అనేక వింతలు, సంఘటనలు ఉన్నాయి. అవి ఎప్పుడూ ప్రజలలో చర్చనీయాంశంగా మారుతాయి. ప్రపంచంలో కొన్ని ప్రత్యేకమైన, కొన్ని వింత రహస్యాలు దాగి ఉన్న అనేక ప్రదేశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రహస్యాల గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు. అలాంటి ఒక రహస్య గుహ గురించిన సమాచారం తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది..ఈ గుహలో లక్షల సంవత్సరాల నాటి నిధిని దాగి ఉందని చెబుతుంటారు. కానీ, ఇంతవరకు ఆ నిధిని ఎవరూ చేజింకిచ్చుకోలేక పోయారు. అంతేకాదు.. ఈ ప్రదేశం గురించి చాలా మందికి తెలుసు. కానీ, ఎవరూ ఇక్కడికి వెళ్ళడానికి సాహసించరు…అటువంటి ప్రదేశం మెక్సికోలో ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన రహస్యం దాగి ఉంది. ఈ ప్రదేశంలో భారీ పరిమాణంలో అనేక స్ఫటికాలు ఉన్నాయి. ఈ స్ఫటికాలు భారీ నిధితో సమానం అంటున్నారు. కానీ ఈ ప్రాంతానికి వెళ్లడం మృత్యువు నోట్లోకి వెళ్లినట్టే అవుతుంది.

మెక్సికోలోని ఈ రహస్య పేరు జెయింట్ క్రిస్టల్ కేవ్. ఇక్కడ, ఒక పర్వతం నుండి దాదాపు 984 అడుగుల దిగువన గుహలో భారీ స్పటిక స్తంభాలు ఉన్నాయి. ఇవి చాలా విలువైనవి. 2000 సంవత్సరంలో శాస్త్రవేత్తలు దీని గురించి తెలుసుకున్నప్పుడు, వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తవ్వకాలలో పర్వతం కింద ఇప్పటివరకు కనిపించని అద్భుతమైన దృశ్యం కనిపించింది.. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ స్ఫటికాలు ఒక రకమైన ఖనిజమైన జిప్సంతో తయారైనట్టుగా గుర్తించారు. ఇది కాగితం, వస్త్ర పరిశ్రమలలో పూరకంగా ఉపయోగించబడుతుంది. భవనాల తయారీకి సిమెంట్‌లో కూడా ఉపయోగిస్తారు.

ఈ గుహలోని స్ఫటిక స్తంభాలు 5 లక్షల సంవత్సరాలకు పైగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఈ స్థలాన్ని సందర్శించడం అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని ప్రజలు సందర్శించేందుకు తెరిచి ఉంచారు. కానీ, ఆ సమయంలో అనేక మరణాలు సంభవించాయట. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ స్ఫటికాల కింద చాలా వేడి శిలాద్రవం పడుతూ ఉంటుంది. 20 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ శిలాద్రవం పగుళ్ల నుండి నెమ్మదిగా బయటపడటం ప్రారంభించింది. ఈ శిలాద్రవం ప్రవహించడం వల్ల పర్వతం ఏర్పడింది. ఈ శిలాద్రవం ద్వారానే స్ఫటికాలు కూడా ఏర్పడ్డాయని పరిశోధకులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

శిలాద్రవం బయటకు వచ్చినప్పుడు గుహలో నీరు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నీటిలో ఒక నిర్జల ఖనిజం ఉంది. అదే సమయంలో, గుహలో ఉష్ణోగ్రత 58 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉంది. ఈ ఉష్ణోగ్రత వద్ద అన్‌హైడ్రేట్ దాని అసలు రూపంలోనే ఉంటుంది. అయితే ఉష్ణోగ్రత 58 కంటే తక్కువగా పడిపోతే, అది స్ఫటికీకరించడం ప్రారంభమవుతుంది. ఒక వైపు అధిక ఉష్ణోగ్రత, మరోవైపు 100శాతం గాలి తేమ, దీని కారణంగా ప్రజలు నిర్జలీకరణం కారణంగా మరణిస్తారని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..