AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warm Water Benefits: ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..!

దీని ద్వారా మీ చర్మంలో దాగి ఉన్న టాక్సిన్లు, మట్టి కణాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ చర్మం హైడ్రేటెడ్‍గా ఉంటుంది. త్వరగా పొడిబారదు. దీంతో మీ ముఖ కాంతి మెరుగుపడుతుంది.. వేడి నీరు తాగితే చర్మానికి రక్తప్రసరణ మెరుగ్గా అవుతుంది. ఇది మీ చర్మ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ముడతలను కూడా తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగటం వల్ల మీ తల మీది చర్మానికి రక్తప్రసరణ బాగా అవుతుంది. దీని వల్ల జట్టు పెరుగుదలకు మేలు జరుగుతుంది.

Warm Water Benefits: ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..!
Warm Water
Jyothi Gadda
|

Updated on: Jan 17, 2024 | 7:27 AM

Share

వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి, సరైన ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. అయితే, సరైన వ్యాయామం, సరైన సమయంలో తినడం ద్వారా మాత్రమే ఆరోగ్యంగా ఉండగలరు. వీటితో పాటు మంచి ఆరోగ్యం కోసం కొన్ని మంచి అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం ఈ అలవాట్లలో ఒకటి. ఎండాకాలం, వానాకాలం, చలి అనే తేడా లేకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం చాలా ముఖ్యం. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

శరీరం నిర్విషీకరణ:

శరీరంలో పేరుకుపోయిన మురికిని వివిధ మార్గాల్లో వదిలించుకోవడం అవసరం. శరీరంలో పేరుకుపోయిన మురికి శరీరం నుంచి బయటకు రావడం ఆగిపోతే మనం అనారోగ్యానికి గురవుతాం. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని మురికి, విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దాని ద్వారా మనం మంచి ఆరోగ్యం పొందుతాం.

ఇవి కూడా చదవండి

జీవక్రియను వేగవంతం చేస్తుంది:

మన శరీరానికి జీవక్రియ చాలా ముఖ్యం. మనం తినే ఆహారం నుండి మనకు లభించే పోషకాలను శక్తిగా మార్చడంలో ఇది సహాయపడుతుంది. సరికాని ఆహారం, అనారోగ్యకరమైన జీవనశైలి జీవక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల ప్రజలు బలహీనంగా, నీరసంగా ఉంటారు. రోజూ వేడినీరు తాగడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు, సరైన జీర్ణక్రియ ముఖ్యం. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే మనం తినే ఆహారం మనల్ని కలవరపెడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

చర్మానికి మేలు చేస్తుంది:

మీ చర్మ రంధ్రాలు మెరుగ్గా తెరుచుకునేందుకు గోరువెచ్చని నీరు ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ చర్మంలో దాగి ఉన్న టాక్సిన్లు, మట్టి కణాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ చర్మం హైడ్రేటెడ్‍గా ఉంటుంది. త్వరగా పొడిబారదు. దీంతో మీ ముఖ కాంతి మెరుగుపడుతుంది.. వేడి నీరు తాగితే చర్మానికి రక్తప్రసరణ మెరుగ్గా అవుతుంది. ఇది మీ చర్మ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ముడతలను కూడా తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగటం వల్ల మీ తల మీది చర్మానికి రక్తప్రసరణ బాగా అవుతుంది. దీని వల్ల జట్టు పెరుగుదలకు మేలు జరుగుతుంది.

నిద్ర నాణ్యతను పెంచుతుంది:

గోరువెచ్చని నీరు ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గోరు వెచ్చని నీటి ఆవిరి నాసికా రద్దీని తగ్గిస్తుంది. జలుబు, సైనస్ లక్షణాల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. గోరు వెచ్చని నీరు నాడీ వ్యవస్థపై శాంతించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో రాత్రి వేళ్లలో మెరుగైన నిద్ర పడుతుంది. అందుకే నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు తాగితే మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..