AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Gallery: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే జిమ్ చేసిన‌ట్లే..! మరింత యంగ్‌గా ఉంటారు..

వెల్లుల్లి మీ బ‌రువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం ఉంటుంది. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

Benefits of Gallery: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే జిమ్ చేసిన‌ట్లే..! మరింత యంగ్‌గా ఉంటారు..
Benefits Of Gallery
Jyothi Gadda
|

Updated on: Jan 17, 2024 | 6:55 AM

Share

అల్లం, వెల్లుల్లి అందరికీ తెలిసిందే.. ఎందుకంటే.. ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే మసాలా ఇది.. ఏ వంటకైనా సరే..అల్లంవెల్లుల్లి మిశ్రమం వేశాకే దాని రుచి రెట్టింపు అవుతుంది.. అయితే, కొందరు మాత్రం వెల్లుల్లిని ఇష్టంతో తింటారు.. మరికొందరికి దాని వాసన కూడా నచ్చదు.. కానీ మన ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మీరు అనేక ప్రమాదకరమైన వ్యాధుల నుండి బయటపడవచ్చునని చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం.

ప్రస్తుతం మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి వెల్లుల్లిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి పనిచేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అంతేకాదు.. వెల్లుల్లి మీ బ‌రువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం ఉంటుంది. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

అలాగే, మీరు ఒత్తిడితో బాధపడుతుంటే వెల్లుల్లి తినడం ప్రారంభించండి. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల మనస్సు సమతుల్యం అవుతుంది. డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది. ప‌చ్చి వెల్లుల్లి తినటం వల్ల గుండెకు మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో బ్లడ్‌ క్లాట్స్‌ వంటివి ఏర్పడకుండా ఉంటుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.