AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Angry Elephant Video: జీవితంలో భయానక క్షణాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పిన ఆనంద్ మహీంద్రా .. వీడియో వైరల్‌..

ఏనుగు ఆ ఇద్దరు పర్యాటకులవైపు దూసుకొస్తుంది. కానీ, వారిద్దరూ భయపడి మడమ తిప్పకుండా అలాగే నిలబడిఉన్నారు.. వారు అలా ధైర్యంగా నిలబడే సరికి ఏనుగు కంగారుపడుతుంది..ధైర్యంగా నిలబడి ఉన్న వారిని చూసి ఆ ఏనుగు భయపడిపోతుంది. దాంతో అది దాడి చేయకుండానే వెనక్కు మళ్లుతుంది.దాంతో ఆ ఏనుగు వెనక్కి వెళ్లిపోతుంది. ఏనుగుకు ఏమాత్రం భయపడని ఈ ఇద్దరు వ్యక్తుల ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే. మనల్ని

Angry Elephant Video: జీవితంలో భయానక క్షణాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పిన ఆనంద్ మహీంద్రా .. వీడియో వైరల్‌..
Anand Mahindra
Jyothi Gadda
|

Updated on: Jan 16, 2024 | 5:20 PM

Share

దేశంలోని ప్రముఖ పారిశ్రామిక, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అతను ఎల్లప్పుడూ తన అధికారిక ఖాతా నుండి కొన్ని ఫన్నీ లేదా విద్యాపరమైన వీడియోలను షేర్ చేస్తారు.. ఇప్పుడు ఇటీవల అతను తన అనుచరులతో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో అతను పారిపోవడానికి బదులు వారి భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రజలకు సందేశం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చాలా భయానక క్షణాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి భయానక పరిస్థితి జీవితంలో ఎదురైతే ఏం చేయాలో సలహా ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఊగిపోతున్న ఓ ఏనుగు వీడియోను షేర్‌ చేశారు. అప్పుడు ఎదురైన భయానక పరిస్థితిని ఎదుర్కోవటానికి అతను విలువైన మార్గదర్శకత్వం ఇచ్చారు.

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి కోపంతో ఉన్న ఏనుగు వీడియోను షేర్ చేసారు. వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఏనుగు నుండి కొంత దూరంలో నెమ్మదిగా నడుస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. అయితే ఒక్కసారిగా ఏనుగు ఆగ్రహంతో వారిపై దాడి చేయడానికి పరిగెత్తుకు వచ్చింది. కానీ, అంతలోనే అది అక్కడే ఆగిపోతుంది. వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా తన మనసు మార్చుకుని వెనక్కి వెళ్లిపోతుంది. అయితే, ఏనుగు కోపంగా ఉందని తెలిసినప్పటికీ వారిద్దరూ అక్కడే నిలబడి ఉన్నారు. ఏనుగు ఆ ఇద్దరు పర్యాటకులవైపు దూసుకొస్తుంది. కానీ, వారిద్దరూ భయపడి మడమ తిప్పకుండా అలాగే నిలబడిఉన్నారు.. వారు అలా ధైర్యంగా నిలబడే సరికి ఏనుగు కంగారుపడుతుంది..ధైర్యంగా నిలబడి ఉన్న వారిని చూసి ఆ ఏనుగు భయపడిపోతుంది. దాంతో అది దాడి చేయకుండానే వెనక్కు మళ్లుతుంది.దాంతో ఆ ఏనుగు వెనక్కి వెళ్లిపోతుంది. ఏనుగుకు ఏమాత్రం భయపడని ఈ ఇద్దరు వ్యక్తుల ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే. మనల్ని నిత్యం వెనక్కు లాగే భయాలను ఎలా జయించాలో చెబుతూ ఆనంద్ మహీంద్రా ఈ వీడియోని షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆనంద్ మహీంద్రా, తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ వీడియోను పంచుకుంటూ, ‘మీ భయాలను వదిలేయండి..ఎదుటి వారి కళ్ళలోకి సూటిగా చూడండి.. దాంతో వారే వెనక్కి వెళ్ళిపోతారు..అంటూ సూచించారు.. కేవలం 18 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షల 72 వేలకు పైగా వీక్షించగా, 9 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియోను చూసిన వినియోగదారులు వివిధ రకాల అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఒక వినియోగదారు మహీంద్రా మాటలకు ప్రతిస్పందనగా.. ప్రతిసారి ఇలాంటి రిస్క్‌ తీసుకోవటం అంత మంచిది కాదని అంటున్నారు. ఇది మంచి వీడియో కానీ ఖచ్చితంగా ఏనుగు ప్రతిసారీ ఇలా ప్రవర్తించదు.., కాస్త ఎక్కువ దూకుడుగా ఉండే ఏనుగు బదులుగా చాలా ఇబ్బందిని కలిగిస్తుందంటూ కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..