AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వార్నీ ఇదేం స్టైల్‌రా సామీ.. స్విమ్మింగ్‌ పూల్‌ లాంటి సెలూన్‌లో కస్టమర్లకు కట్టింగ్‌.. వీడియో చూస్తే అవాక్కే..!

వైరల్ వీడియోలో మీరు చూసినట్టుగా సెలూన్‌లో నిండా నీరు కనిపిస్తుంది.. కస్టమర్లు కూర్చోవడానికి కుర్చీలు, అన్ని రకాలుగా అవసరమైన పరికరాలు, టేబుల్‌లు కస్టమర్ల కోసం సిద్ధం చేసి ఉంచారు. ఇక్కడ సిబ్బంది నీటిలో నిలబడి కస్టమర్లకు హెయిర్‌ స్టైల్‌ చేస్తున్నారు..జుట్టు కట్టింగ్‌ కోసం వచ్చిన కస్టమర్లు తమ జుట్టును కత్తిరించేటప్పుడు నీటిలో తమ పాదాలను ఉంచి ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు..ఇలాంటి స్పెషల్‌ సెలూన్‌కు

Watch Video: వార్నీ ఇదేం స్టైల్‌రా సామీ.. స్విమ్మింగ్‌ పూల్‌ లాంటి సెలూన్‌లో  కస్టమర్లకు కట్టింగ్‌.. వీడియో చూస్తే అవాక్కే..!
Salon
Jyothi Gadda
|

Updated on: Jan 16, 2024 | 1:27 PM

Share

ఆధునిక యుగంలో చాలా విషయాలు వేగంగా మారుతున్నాయి. అందివచ్చిన టెక్నాలజీ, ఆధునిక విధానాలను బాగా అలవాటు చేసుకుంటున్నారు ప్రజలు. దీంతో వ్యాపారంలో కూడా కొత్త కొత్త ఎత్తుగడలు అమల్లోకి వస్తున్నాయి. ఒకప్పుడు నగరాలు, పట్టణాల్లోని అనేక వీధుల్లో బార్బర్‌ షాపులు ఉండేవి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హెయిర్‌కట్‌ కోసం అక్కడికి వెళ్తుంటారు. ప్రస్తుతం వాటి స్థానంలో అనేక బ్యూటీ పార్లర్లు, స్పాలుగా మారిపోయాయి… ఇప్పుడు ఈ వ్యాపారంలోకి అనేక ఆఫర్లతో వివిధ కంపెనీల సెలూన్లు ప్రవేశించాయి. ఈ సెలూన్లు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయి..అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో మీరు ప్రత్యేకమైన థీమ్‌తో ఏర్పాటు చేసిన సెలూన్‌ని చూడవచ్చు.

వైరల్ వీడియోలో మీరు చూసినట్టుగా సెలూన్‌లో నిండా నీరు కనిపిస్తుంది.. కస్టమర్లు కూర్చోవడానికి కుర్చీలు, అన్ని రకాలుగా అవసరమైన పరికరాలు, టేబుల్‌లు కస్టమర్ల కోసం సిద్ధం చేసి ఉంచారు. ఇక్కడ సిబ్బంది నీటిలో నిలబడి కస్టమర్లకు హెయిర్‌ స్టైల్‌ చేస్తున్నారు..జుట్టు కట్టింగ్‌ కోసం వచ్చిన కస్టమర్లు తమ జుట్టును కత్తిరించేటప్పుడు నీటిలో తమ పాదాలను ఉంచి ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు..ఇలాంటి స్పెషల్‌ సెలూన్‌కు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

సెలూన్ మొత్తం వాటర్ థీమ్‌తో రూపొందించబడింది. అలాగే, నీటిలో నిలబడి కస్టమర్ల జుట్టు కత్తిరిస్తున్నారు సిబ్బంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఓ వ్యక్తి కత్తిరించిన వెంట్రుకలు నీళ్లలో పడడంతో ఆ వెంటనే నెట్‌తో నీటిని శుభ్రం చేస్తుండటం కూడా మనం చూడొచ్చు.

ఈ వీడియో Instagram ఖాతా @radenthebarber.lsm మరియు @radenthebarber నుండి సోషల్ మీడియాలో షేర్‌ చేయబడింది. ఈ సెలూన్‌ని సందర్శించిన తర్వాత ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా స్విమ్మింగ్ పూల్‌లో లేదా నదిలో కూర్చున్నట్లు భావించాలి అనడంలో సందేహం లేదు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ రియాక్షన్‌లతో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియో సోషల్ మీడియాలో పలువురి దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..