AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన సీతాకోక చిలుక ఎప్పుడైనా చూశారా.. ? IAS అధికారులు షేర్ చేసిన ఫోటోకు నెటిజన్లు ఫిదా..

ఈ నీలి రంగు సీతాకోక చిలుక ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ట్వీట్ షేర్ చేసినప్పటి నుండి 38,900 వ్యూ్‌స్‌తో దూసుకుపోతోంది. అలాగే, దీనికి వేల సంఖ్యలో లైక్‌లు, రీట్వీట్‌లు వచ్చాయి. చాలా మంది చాలా మంచి కామెంట్స్ కూడా చేశారు. ప్రకృతి చాలా అందంగా ఉంటుందని ఒకరు చెప్పగా,... మరోకరు అందమైన ప్రకృతిలో అంతే అందమైన సీతాకోకచిలుక ఇది.. ఇదొక అరుదైన జాతి అంటూ వ్యాఖ్యనించారు.

అరుదైన సీతాకోక చిలుక ఎప్పుడైనా చూశారా.. ?  IAS అధికారులు షేర్ చేసిన ఫోటోకు నెటిజన్లు ఫిదా..
Blue Coloured Butterfly
Jyothi Gadda
|

Updated on: Jan 16, 2024 | 10:55 AM

Share

ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ ఎక్కడ చూడని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఓ అరుదైన సీతాకోక చిలుక జాతుల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి పేజీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి సుప్రియా సాహు ఈ అందమైన ప్రకృతిలో భాగమైన ఈ సీతాకోకచిలుక ఫోటోను X హ్యాండిల్‌పై షేర్‌ చేశారు. 33 ఏళ్ల తర్వాత పశ్చిమ కనుమల్లో ఇలాంటి కొత్త జాతి సీతాకోకచిలుకను గుర్తించినట్టుగా పేర్కొన్నారు. కొత్తగా కనిపించిన ఈ సీతాకోక చిలుకకు సిగరిటిస్ మేఘమలైయెన్సిస్ అని పేరు పెట్టారు. ఈ ఆవిష్కరణతో పశ్చిమ కనుమలలో మొత్తం సీతాకోకచిలుకల సంఖ్య 337కి చేరుకుందని సుప్రియా సాహు తెలిపారు. ఈ నీలి రంగు సీతాకోక చిలుక ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తమిళనాడులోని మెగామలైలోని శ్రీవిలిపుత్తూరు టైగర్ రిజర్వ్‌లో కొత్త జాతి సీతాకోకచిలుకను పరిశోధకులు కనుగొన్నారు. ఇది 33 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన కొత్త జాతి సీతాకోకచిలుకగా వెల్లడించారు. దీంతో ఇప్పుడు పశ్చిమ కనుమలలో మొత్తం సీతాకోకచిలుకల సంఖ్య 337కి పెరిగింది. ఇందులో పశ్చిమ కనుమలకు చెందిన 40 జాతులు ప్రత్యేకమైనవిగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ సోషల్ మీడియా పోస్ట్‌ను IAS అధికారిణి సుప్రియా సాహు అధికారిక X (ట్విట్టర్) ఖాతా @supriyasahuias ద్వారా పోస్ట్ చేయబడింది. మీరు పోస్ట్‌లో చూసినట్లుగా, నీలి రంగు సీతాకోకచిలుక అందమైన ఫోటో షేర్ చేయబడింది. ఈ సీతాకోకచిలుకకు సంబంధించిన సమాచారం క్యాప్షన్‌లో వ్రాయబడింది.

ఈ ట్వీట్ షేర్ చేసినప్పటి నుండి 38,900 వ్యూ్‌స్‌తో దూసుకుపోతోంది. అలాగే, దీనికి వేల సంఖ్యలో లైక్‌లు, రీట్వీట్‌లు వచ్చాయి. చాలా మంది చాలా మంచి కామెంట్స్ కూడా చేశారు. ప్రకృతి చాలా అందంగా ఉంటుందని ఒకరు చెప్పగా,… మరోకరు అందమైన ప్రకృతిలో అంతే అందమైన సీతాకోకచిలుక ఇది.. ఇదొక అరుదైన జాతి అంటూ వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..