AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teachers: పాటలతో పాఠాలు చెబుతున్న టీచర్‌..! పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో చూస్తే..

క్లాస్‌లో టీచర్‌ పాఠాలు చెబుతున్న తీరుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో టీచర్‌ పిల్లలకు పండ్లు, అక్షరమాల పేర్లను విభిన్నంగా నేర్పించటం కనిపించింది. పిల్లలు కూడా టీచర్‌ చెప్పే పాఠాలను ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నారు. వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Teachers: పాటలతో పాఠాలు చెబుతున్న టీచర్‌..! పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో చూస్తే..
Teacher Teaches Alphabets
Jyothi Gadda
|

Updated on: Jan 14, 2024 | 4:10 PM

Share

గత కొన్నేళ్లుగా చిన్న పిల్లలకు చదువు చెప్పే విధానం పూర్తిగా మారిపోయింది. చిన్న పిల్లలకు బోధించే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు పిల్లలకు సరదాగా పాఠాలు చెప్పే స్టైల్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇప్పుడు పిల్లలు త్వరగా గుర్తుపెట్టుకునేలా సరదాగా బోధించే ప్రయత్నాలు చేస్తున్నారు. క్లాస్‌లో టీచర్‌ పాఠాలు చెబుతున్న తీరుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో టీచర్‌ పిల్లలకు పండ్లు, అక్షరమాల పేర్లను విభిన్నంగా నేర్పించటం కనిపించింది. పిల్లలు కూడా టీచర్‌ చెప్పే పాఠాలను ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నారు. వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో అమ్మాయిలు యాపిల్ గురించి పాట రూపంలో నేర్చుకుంటున్నారు. ఆపిల్ … ఆపిల్ రెడ్, రెడ్ ఆపిల్ … చాలా చాలా స్వీట్ ఆపిల్. ఇలాగే రకరకాల పండ్లను చేతిలో పట్టుకుని అమ్మాయిలు జాలీగా పాట రూపంలో పాడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ అవుతోంది. ఈ బోధనా పద్ధతిని నెటిజన్లు సైతం తెగ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో Instagram వేదికగా_sushiii హ్యాండిల్‌లో షేర్‌ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా లైక్ చేశారు. చాలా మంది వినియోగదారులు వీడియోపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలా మంది ఈ వీడియో పూర్తిగా కావాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

దీని పూర్తి వెర్షన్ వినాలనుకుంటున్నాం.. నాకు దాని పూర్తి వెర్షన్ కావాలంటూ… ఈ వీడియో పూర్తి పాట కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీకు కూడా అదే కావాలంటే, ఇది X @memenist_ హ్యాండిల్‌లో షేర్‌ చేయబడింది. అమ్మాయిల ఈ స్టైల్‌ని ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. ప్రజలు ఘాటుగా వ్యాఖ్యానించడమే కాకుండా షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..