AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Excess Sweating: మీకు ఎక్కువగా చెమటలు పడుతున్నాయా..? గుండెపోటు రావొచ్చు!

విపరీతంగా చెమట పట్టే వారికి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే పుష్కలంగా నీరు త్రాగాలి. శరీరం వేడెక్కకుండా ఉండేందుకు కాటన్ దుస్తులను ధరించండి. చెమట వాసనను కూడా నివారించవచ్చు. తరచుగా నిమ్మరసం తాగడం మంచిది. అలాగే శరీరాన్ని చల్లబరచడానికి నీరు ఎక్కువగా తాగాలి. పురుషులు రోజుకు 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్లు నీరు తాగాలి. ఇది మన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. శరీరం నుండి అధిక చెమటను తగ్గిస్తుంది.

Excess Sweating: మీకు ఎక్కువగా చెమటలు పడుతున్నాయా..? గుండెపోటు రావొచ్చు!
Excess Sweating
Jyothi Gadda
|

Updated on: Jan 14, 2024 | 8:03 AM

Share

ఎక్కువగా చెమట పట్టడం అనేది మనల్ని తరచుగా ఇబ్బంది పెడుతుంది. కొద్ది దూరం నడిచినా ఒళ్లంతా చెమటలు పట్టే వారు మన మధ్యే ఉన్నారు. కానీ కొందరికి అస్సలు చెమట పట్టదు. అయితే, చెమటలు పట్టడం సహజం. కానీ, సాధారణంగా చెమటలు పట్టడం ఆరోగ్యకరమైన శరీరానికి సంకేతం. ఏదైనా శరీరక శ్రమ జరిగినప్పుడు చెమట పడుతుంది. కానీ కొంతమంది ఏమీ చేయకుండానే చెమటలు పడుతుంటాయి. అలా మీ శరీరం కూడా విపరీతంగా చెమట పడుతోందా? అలా అయితే, జాగ్రత్తగా ఉండండి. బహుశా ఇది పెద్ద వ్యాధికి సంకేతం. చెమట ఎక్కువగా పడితే దానికి కారణం ఏమిటి? దాన్ని పరిష్కరించడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఎక్కువ చెమట పట్టడం ఆరోగ్యానికి హానికరం:

ఎక్కువ చెమట పట్టడం ఆరోగ్యానికి హానికరం. ఇది ఒక రకమైన వ్యాధి అని చెప్పవచ్చు. హైపర్ హైడ్రోసిస్ అని పిలువబడే ఈ పరిస్థితి లక్షణం అధిక చెమట. మీరు ఎక్కువగా చెమట పట్టినప్పుడు, మీ శరీరం నుండి ఎక్కువ నీరు కోల్పోతారు.

ఇవి కూడా చదవండి

అధిక చెమటకు కారణాలు :

అధిక చెమటకు అనేక కారణాలు ఉన్నాయి.. గుండె కవాటం వాపు, ఎముక సంబంధిత ఇన్ఫెక్షన్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వంటి అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. విపరీతమైన చెమట గుండె జబ్బులకు సంకేతం కావచ్చు కొన్నిసార్లు ఒత్తిడి కూడా అధిక చెమటకు కారణమవుతుంది.

చెమట ఎక్కువగా పడితే ఏం చేయాలి?:

విపరీతంగా చెమట పట్టే వారు ముందుగా ఆహారంపై శ్రద్ధ వహించాలి. అలాగే ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. మద్యానికి దూరంగా ఉండాలి. మీరు గర్భధారణ సమయంలో అధిక చెమటను అనుభవిస్తే, మీరు వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. మీ ఆహారంలో విటమిన్లు పుష్కలంగా ఉండే పోషకమైన ఆహారాన్ని చేర్చండి.

విపరీతమైన చెమటలు పట్టేవారు ఏం చేయాలి..?:

విపరీతంగా చెమట పట్టే వారికి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే పుష్కలంగా నీరు త్రాగాలి. శరీరం వేడెక్కకుండా ఉండేందుకు కాటన్ దుస్తులను ధరించండి. చెమట వాసనను కూడా నివారించవచ్చు. తరచుగా నిమ్మరసం తాగడం మంచిది. అలాగే శరీరాన్ని చల్లబరచడానికి నీరు ఎక్కువగా తాగాలి. పురుషులు రోజుకు 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్లు నీరు తాగాలి. ఇది మన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. శరీరం నుండి అధిక చెమటను తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..