AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Jonna Tomato Bath: ఉదయాన్నే హెల్దీ టిఫిన్ తినాలా.. జొన్న టమాటా బాత్ బెస్ట్!

దీర్ఘకాలిక వ్యాధులు వరుస పెట్టి ఎటాక్ చేయడం మొదలు పెట్టడంతో.. చాలా మంది హెల్దీ డైట్‌ని మెయిన్ టైన్ చేస్తున్నారు. ఇలా ఉదయం పూట హెల్దీ అల్పాహారం తినాలి అనుకున్న వారికి మొక్కజొన్న టమాటా బాత్ బెస్ట్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక బరువు, డయాబెటీస్, రక్త పోటు వంటి వాటితో బాధపడేవారు జొన్న రవ్వతో తయారు చేసే టమాటా బాత్‌ని ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం..

Healthy Jonna Tomato Bath: ఉదయాన్నే హెల్దీ టిఫిన్ తినాలా.. జొన్న టమాటా బాత్ బెస్ట్!
Jonna Tomato Bath
Chinni Enni
| Edited By: |

Updated on: Jan 14, 2024 | 7:33 PM

Share

దీర్ఘకాలిక వ్యాధులు వరుస పెట్టి ఎటాక్ చేయడం మొదలు పెట్టడంతో.. చాలా మంది హెల్దీ డైట్‌ని మెయిన్ టైన్ చేస్తున్నారు. ఇలా ఉదయం పూట హెల్దీ అల్పాహారం తినాలి అనుకున్న వారికి మొక్కజొన్న టమాటా బాత్ బెస్ట్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక బరువు, డయాబెటీస్, రక్త పోటు వంటి వాటితో బాధపడేవారు జొన్న రవ్వతో తయారు చేసే టమాటా బాత్‌ని ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. మరి జొన్న రవ్వ టమాటా బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

జొన్న టమాటా బాత్‌కి కావాల్సిన పదార్థాలు:

జొన్న రవ్వ, టమాటాలు, తాళింపు దినుసులు, కరివేపాకు, కొత్తి మీర, అల్లం, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, పచ్చి బఠాణి, క్యారెట్, ఆయిల్.

జొన్న టమాటా బాత్‌ తయారీ విధానం:

ముందుగా జొన్న రవ్వను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు తాళింపు దినసులు, అల్లం తురుము, కరివేపాకు వేసి బాగా వేయించు కోవాలి. ఆ నెక్ట్స్ పచ్చిమిర్చి, ఉల్లి పాయ ముక్కలు వేసి వేగాక.. బఠాని, క్యారెట్ ముక్కలు కూడా వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేశాక.. టమాటా ముక్కలు, ఉప్పు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ మగ్గించాలి.

ఇవి కూడా చదవండి

టమాటా ముక్కలు బాగా మగ్గాక.. కొలతకు సరిపడా వాటర్ పోసి కలపాలి. నీళ్లు మరిగాక.. రవ్వ వేసి కలుపుకోవాలి. రవ్వ ఉడుకుతూ.. దగ్గరకి అయ్యేంత వరకూ ఉడికించు కోవాలి. రవ్వ ఉడికిన తర్వాత కొత్తి మీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే. కావాల్సిన వారు ఈ టైమ్‌లో నెయ్యి వేసుకోవచ్చు. హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినాలి అనుకునేవారు ఇలా జొన్న రవ్వతో ఎంతో టేస్టీగా ఉండే టమాటా బాత్ తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి