AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కారు విండోలో ఇరుక్కున్న చిన్నారి.. కొన ఊపిరితో ఉండగా.. దేవుడిలా వచ్చిన బాటసారి..

క్లిష్ట పరిస్థితుల్లో భగవంతుడి రూపంలో ఎవరో వచ్చి వారిని రక్షిస్తారు అన్నట్టుగానే కొన్ని కొన్ని సంఘటనలు  జరిగిపోతుంటాయి. ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ చిన్నారి మెడ కారు విండో అద్దంలో ఇరుక్కుపోవటంతో ఆ చిన్నారి తల్లడిల్లిపోతుంది. నొప్పితో చిన్నారి మెలికలు తిరుగుతాడు..అంతలోనే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చాకచక్యంగా ఆ పసిబిడ్డ ప్రాణాలను కాపాడాడు. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

Watch Video:  కారు విండోలో ఇరుక్కున్న చిన్నారి.. కొన ఊపిరితో ఉండగా..  దేవుడిలా వచ్చిన బాటసారి..
Kid Gets Stuck In Car's Win
Jyothi Gadda
|

Updated on: Jan 14, 2024 | 6:38 PM

Share

సోషల్ మీడియాలో కోట్లాది వీడియోలు అప్‌లోడ్ చేయబడుతున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రజల హృదయాలను గెలుచుకోగలుగుతున్నాయి. కొన్ని వీడియోలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి గూస్‌బంప్‌లు తెప్పిస్తుంటాయి. కొన్ని వీడియోలలో ప్రజలు ప్రమాదకర పరిస్థితులలో చిక్కుకున్న సందర్భాలు కనిపిస్తాయి. ప్రమాద సమయాల్లో ప్రజలు వాటి నుండి ఎలా బయటపడతారో కూడా ఎవరూ ఊహించలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భగవంతుడి రూపంలో ఎవరో వచ్చి వారిని రక్షిస్తారు అన్నట్టుగానే కొన్ని కొన్ని సంఘటనలు  జరిగిపోతుంటాయి. ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ చిన్నారి మెడ కారు విండో అద్దంలో ఇరుక్కుపోవటంతో ఆ చిన్నారి తల్లడిల్లిపోతుంది. నొప్పితో చిన్నారి మెలికలు తిరుగుతాడు..అంతలోనే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చాకచక్యంగా ఆ పసిబిడ్డ ప్రాణాలను కాపాడాడు. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్ వీడియోను చూస్తుంటే, కారులోంచి ఓ పెద్దావిడ కిందకు దిగేందుకు డోర్‌ ఓపెన్‌ చేస్తుంది. అంతలోనే.. హఠాత్తుగా చంటి పిల్లవాడు కిటికీ అద్దంలో ఇరుక్కుపోయి వేలాడుతూ కనిపించాడు. అంతలోనే డ్రైవర్ కిటికీలన్నీ క్లోజ్‌ చేస్తున్నాడు.. దాంతో దీంతో చిన్నారి మెడ గ్లాసులో ఇరుక్కుపోయింది. డ్రైవరు గ్లాస్ దించాలనుకున్నా దించలేకపోయాడు. పిల్లవాడు నొప్పితో బాధపడటం కనిపించింది. ఇంతలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి చిన్నారిని గమనించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారు దగ్గరకు చేరుకుని చిన్నారిని లాగడం మొదలుపెట్టాడు. లాగి బయటకు తీయలేమని మరుక్షణం అర్థమైంది. ఆ వ్యక్తి వెంటనే కారు కిటికీని కొట్టడం ప్రారంభించాడు. అద్దం పగిలి కింద పడిపోవడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న వీడియో చూసిన నెటిజన్లు చిన్నారిని రక్షించిన వ్యక్తిని ఇప్పుడు ప్రజలు దేవదూత అని పిలుస్తున్నారు. కాస్త ఆలస్యం చేసి ఉంటే ఆ పిల్లవాడి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదని అంటున్నారు. ఈ వీడియో @cctvidiots పేరుతో X హ్యాండిల్‌లో షేర్‌ చేయబడింది. కొన్ని సెకన్ల వీడియోను నాలుగున్నర లక్షల మందికి పైగా వీక్షించారు. ఇది చూసిన ఒక వినియోగదారు స్పందిస్తూ.. వీడియోలో..కనిపించిన నల్ల చొక్కా ధరించిన వ్యక్తి హీరో అంటూ ప్రశంసించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాన్ని కొందరు గుర్తు చేసుకున్నారు. చిన్న పిల్లలతో ప్రయాణం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..