AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బేరసారాల్లో మనల్ని మించిపోయిన ఆస్ట్రేలియా మహిళ.. నచ్చిన కుర్తాను ఏ ధరకు అడిగిందో తెలుసా ?.. షాకవుతున్న నెటిజన్స్..

విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఇలా వ్యవహరించడం మానుకోవాలంటూ మరికొందరు సూచిస్తున్నారు. ఆ కుర్తా చాలా అందంగా ఉంది. 6 డాలర్లు దాని కోసం ఖర్చు చేయటం పెద్ద విషయం కాదంటూ మరికొందరు కామెంట్‌ చేశారు. పైగా మరికొందరు.. ఆ అమ్మాయి స్వయంగా దుకాణదారునికి కాస్త టిప్పుగా ఇవ్వాల్సి ఉండేదని ఇంకొకరు వ్యాఖ్యానించారు.

బేరసారాల్లో మనల్ని మించిపోయిన ఆస్ట్రేలియా మహిళ.. నచ్చిన కుర్తాను ఏ ధరకు అడిగిందో తెలుసా ?.. షాకవుతున్న నెటిజన్స్..
Bargaining For Small Price
Jyothi Gadda
|

Updated on: Jan 16, 2024 | 11:39 AM

Share

షాపింగ్‌ చేసేటప్పుడు మనం తప్పనిసరిగా బార్గెనింగ్ చేస్తాం.. దాదాపుగా బేరం ఆడందే సామాన్య, మధ్యతరగతి ప్రజలేవరూ కూడా ఏది కొనలేరు.. నిజంగా చెప్పాలంటే.. బేరమాడటం కూడా ఒక కళ అనే చెప్పాలి..ఎందుకంటే కొన్ని చోట్ల వ్యాపారులు.. 100 రూపాయల వస్తువును కూడా వెయ్యి రూపాయల లాభంతో అమ్ముతుంటారు.. అందుకే చాలామంది ప్రజలు వెయ్యి రూపాయలు చెప్పిన వస్తువును కూడా రెండు మూడు వందలకు కూడా అడుగుతుంటారు. అమ్మకం దారులకు కుదిరితే ఇచ్చేస్తుంటారు కూడా..అది బట్టలు, చెప్పులు, లేదా కూరగాయల మార్కెట్‌లో ఒక కట్ట కొత్తిమీర అయినా సరే బేరమాడటం ప్రతి వ్యక్తికి ఉండే అలవాటు ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ సుత్తంతా మాకేందుకు అనుకుంటున్నారా..? అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదేంటంటే…

ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లా అనే యువతి ఢిల్లీలోని సరోజినీ నగర్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.. వీడియోలో షాపింగ్ చేసేటప్పుడు ఆమె దుకాణదారుని ధర తగ్గించమని అడగడం కనిపించింది. అయితే, బట్టలకు అనవసరమైన ధర చెల్లించినందుకు ఆమె కొంత కలత చెందుతుంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలోని సరోజినీ నగర్ చౌకైన అందమైన బట్టలు, ఫ్యాషన్ వస్తువులకు ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రెలియాకు చెందిన యువతి కూడా ఈ మార్కెట్ గుండా వెళుతున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో ఆకుపచ్చ రంగు కుర్తాను గమనించింది. ఆమె తన వీడియోలో పేర్కొన్నట్లుగా ఆమెకు ఆ కలర్‌ కుర్తా బాగా నచ్చిందట..దాంతో ఆమె దుకాణదారుడిని దాని ధర అడిగితే, అతను రూ.350 అన్నాడు. అందుకు ఆమె రూ.250కి ఇవ్వాలని దుకాణదారుని కోరింది. 250 రూపాయలకు కుర్తా ఇవ్వమంటూ.. ఆమె దుకాణదారుని చాలాసేపు బార్గెనింగ్‌ చేసింది. కానీ దుకాణదారుడు..ససేమిరా అన్నాడు..350కి ఒక్క పైసా కూడా తగ్గించేది లేదని తేల్చిచెప్పాడు..కానీ, ఆ కుర్తా ఎల్లాకు బాగా నచ్చడంతో చివరకు రూ.350పెట్టి ఆ డ్రెస్‌ కొనుగోలు చేసింది.. అక్కడే పై నుంచి వేసేసుకుంటుంది.. ఆ తర్వాత తన ఫీలింగ్ నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

అమ్మకందారుడు ఆ కుర్తా ఖచ్చితమైన ధరను పేర్కొన్నాడు. అయినా కూడా ఆ అమ్మాయి ధరను తగ్గించాలంటూ కోరుతుంది.. ఇది దారుణం అంటూ పలువురు ఈ వైరల్‌ వీడియోపై స్పందించారు. ఎందుకంటే.. విదేశీయులకు 6 డాలర్లు చాలా తక్కువ ధర అంటున్నారు.. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఇలా వ్యవహరించడం మానుకోవాలంటూ మరికొందరు సూచిస్తున్నారు. ఆ కుర్తా చాలా అందంగా ఉంది. 6 డాలర్లు దాని కోసం ఖర్చు చేయటం పెద్ద విషయం కాదంటూ మరికొందరు కామెంట్‌ చేశారు. పైగా మరికొందరు.. ఆ అమ్మాయి స్వయంగా దుకాణదారునికి కాస్త టిప్పుగా ఇవ్వాల్సి ఉండేదని ఇంకొకరు వ్యాఖ్యానించారు.

ఇలా చాలా మంది నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు. సోషల్ మీడియా X [గతంలో ట్విట్టర్]లో @mushruem అనే ఖాతా ద్వారా వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 14.2 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..