Watch Video: వామ్మో.. వీడు ముట్టుకుంటే మంటలే..! చేతి వేళ్లతో గ్యాస్‌ స్టౌవ్‌ వెలిగిస్తున్న యువకుడు..

యువకుడు తన చేతి వేలితో గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియో 729k వ్యూస్‌, వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు సంపాదించుకుంది. చాలా మంది ఈ వీడియోపై భిన్నమైన అభిప్రాయాలు, కామెంట్స్‌ షేర్ చేశారు. ఈ టెక్నాలజీ మన సరిహద్దులు దాటి వెళ్లకూడదంటూ ఒక వీక్షకుడు రాశాడు. మరికొందరు వీడియోను అనుకరించవద్దని కోరారు. ముఖ్యంగా ఆన్‌లైన్..

Watch Video: వామ్మో.. వీడు ముట్టుకుంటే మంటలే..! చేతి వేళ్లతో గ్యాస్‌ స్టౌవ్‌ వెలిగిస్తున్న యువకుడు..
Gas Stove Igniting
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 16, 2024 | 12:20 PM

గారడీ చేయడం, రకరకాల ఉపాయాలతో ఏదైనా సృష్టించడం, జుగాఢ్‌లతో అద్భుతాలు సృష్టించడంలో భారతీయులను ఎవరూ ఓడించలేరు..అందరినీ ఆశ్చర్యపరిచే అలాంటి ఓ ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైరల్‌ వీడియోలో ఒక యువకుడు తన వేలితో వంటగదిలో గ్యాస్ స్టవ్ వెలిగించడం చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. యువకుడు తన చేతి వేలితో గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎలా చేశాడో మీరూ చూడండి.

ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ ప్రత్యేక వీడియో సంచలనం రేపుతోంది. క్లిప్‌లో ఒక బాలుడు స్టాటిక్ ఎనర్జీని ఉపయోగించి గ్యాస్ స్టవ్‌ను వెలిగించడం కనిపించింది. క్లిప్‌లో అబ్బాయి స్టవ్‌కి దగ్గరగా కుర్చీపై కూర్చోని ఉన్నాడు..తన చేతి వేలిని గ్యాస్‌ స్టౌవ్‌పై పెట్టాడు.. అకస్మాత్తుగా మరో యువకుడు అక్కడకు వచ్చి.. ఆ కుర్రాడి తలపై టవల్‌ లాంటిది కప్పి, వేగంగా లాగేశాడు.. ఈ సమయంలో, యువకుడు స్టవ్ బర్నర్‌పై చేయి పెట్టినప్పుడు, బర్నర్ నుండి మంటలు లేచాయి. లైటర్, అగ్గిపెట్టె లేకుండా కేవలం వేళ్లతో గ్యాస్ స్టవ్ వెలిగించారు. “స్టాటిక్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం ద్వారా గ్యాస్ స్టవ్‌ను మండించాడు ఆ వ్యక్తి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారటంతో ప్రజలు పరేషాన్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

గాడ్‌మాన్ చిక్నా అనే ట్విట్టర్ ఖాతా ద్వారా వీడియోను పంచుకున్నారు. వీడియోను షేర్‌ చేస్తూ.. వీడియోలోని యువకుడు ఎలాంటి అద్భుతాలు చేయలేదని, స్టాటిక్ ఎనర్జీని ఉపయోగించి గ్యాస్ స్టవ్ వెలిగించాడని స్పష్టంగా తెలుస్తోందన్నారు. స్థిర విద్యుత్ అనేది ఒక వస్తువు లోపల లేదా ఉపరితలంపై విద్యుత్ చార్జీల అసమతుల్యతను సూచిస్తుంది. వీడియోలో కుర్చీపై కూర్చున్న బాలుడు తనకు తెలియకుండానే మానవ కెపాసిటర్‌గా మారాడు. అతను తన పరిసరాలతో పరస్పర చర్య చేస్తున్నప్పుడు స్థిర విద్యుత్‌ను నిల్వ చేస్తాడు. నేలతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్న పిల్లల తలపై దుప్పటిని లాగినప్పుడు, ఒంట్లో ఉన్న స్టాటిక్ ఎనర్జీ వేలి ద్వారా విడుదల చేయబడుతుంది. గ్యాస్ స్టవ్‌ను వెలిగించేంత స్పార్క్‌ను సృష్టిస్తుంది. ఈ విధంగా గ్యాస్ మండుతుంది.

సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించిన వీడియో వేగంగా వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియో 729k వ్యూస్‌, వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు సంపాదించుకుంది. చాలా మంది ఈ వీడియోపై భిన్నమైన అభిప్రాయాలు, కామెంట్స్‌ షేర్ చేశారు. ఈ టెక్నాలజీ మన సరిహద్దులు దాటి వెళ్లకూడదంటూ ఒక వీక్షకుడు రాశాడు. మరికొందరు వీడియోను అనుకరించవద్దని కోరారు. ముఖ్యంగా ఆన్‌లైన్ వీక్షణలను ప్రజలు ఎక్కువగా అనుకరించే అవకాశం ఉంది. గ్యాస్ వంటి పేలుడు పదార్థాలతో ఇలాంటి అజాగ్రత్త విధానాలు ప్రయత్నించటం తీవ్రమైన హాని కలిగిస్తుందని కొందరు హెచ్చరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..