Baikal Teal Duck: 109 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన బాతు.. ఎక్కడో తెలుసా..?

మగ బైకాల్ టీల్ తలపై గోధుమ రంగు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు రంగుల ప్రత్యేక సారాలు కలిగి ఉంటుంది. మగ పక్షి తల ఆడపక్షి కంటే పెద్దది. బైకాల్ టీల్ నదులు, సరస్సులు, చెరువులు, అడవులకు దగ్గరగా ఉన్న చిత్తడి నేలలలో కనిపిస్తుంది. ఈ టీల్ జాతులు విత్తనాలు, ధాన్యాలు, ఆకులు, కాండం, గడ్డి, జల మొక్కలు, నత్తలు వంటివి ఆహారంగా తింటాయి. ఈ టీల్ జాతులు ఏప్రిల్-మేలో సంతానోత్పత్తి ప్రదేశాలకు చేరుకుంటాయి.

Baikal Teal Duck: 109 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన బాతు.. ఎక్కడో తెలుసా..?
Baikal Teal Duck
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 16, 2024 | 12:55 PM

మణిపూర్‌లో విస్మయకర సంఘటన చోటుచేసుకుంది. 109 సంవత్సరాల తర్వాత బైకాల్ టీల్ అనే అరుదైన రష్యన్ పక్షి జాతి బాతు కనిపించింది. వైల్డ్‌లైఫ్ ఎక్స్‌ప్లోరర్స్ మణిపూర్ (WEM), ఇండియన్ బర్డ్ కన్జర్వేషన్ నెట్‌వర్క్‌ల బృందం లాంఫెల్ వెట్‌ల్యాండ్‌ను గుర్తించారు. ఈ జాతి పక్షులు మణిపూర్‌లో మార్చి 16, 1913, నవంబర్ 28, 1915లో రెండుసార్లు మాత్రమే గుర్తించారు. బైకాల్ టీల్‌ని బైమాక్యులేట్ డక్ అని కూడా అంటారు. ఈ అరుదైన బైకాల్ 109 సంవత్సరాల తర్వాత శీతాకాలపు వలస పక్షుల సీజన్‌లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని లాంఫెల్పట్ చిత్తడి నేలల్లో కనిపించింది. వైల్డ్‌లైఫ్ ఎక్స్‌ప్లోరర్స్ మణిపూర్ (WEM) బృందం జనవరి 10న లాంఫెల్‌పట్ వెట్‌ల్యాండ్‌లో సీజనల్ ఏవియన్ మానిటరింగ్ ఎక్సర్‌సైజ్‌లో బాతును గుర్తించింది. WEM బృంద సభ్యులు బాతు తలపై ఒక ఆసక్తికరమైన నమూనాను గమనించారు.

WEM బృందం ఇటీవల మణిపూర్‌లో మొదటి అముర్ ఫాల్కన్ గణనను నిర్వహించింది. ఈసారి ఈ బృందం మణిపురి లో ‘సూరిట్-మ్యాన్’ అని పిలువబడే ఈ బాతు ఏకైక జాతిని గుర్తించింది. ఈ బాతు శీతాకాలంలో తూర్పు రష్యా, తూర్పు ఆసియాలో సంతానోత్పత్తి చేస్తుంది. పూర్తి శీతాకాలం తూర్పు ఆసియాలోనే గడుపుతుంది. బైకాల్ టీల్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) రెడ్ లిస్ట్‌లో ఉందని చెప్పారు. రిజర్వాయర్‌లు, అటవీ విభాగాల తగ్గుదల కారణంగా వలస పక్షుల సంఖ్య తగ్గుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అరుదైన, అంతరించిపోతున్న పక్షి జాతులను పర్యవేక్షించడానికి ఉత్తరాఖండ్ బయోడైవర్సిటీ బోర్డ్ ఇ-బర్డ్ అప్లికేషన్‌ను ప్రారంభించింది.

ఇకపోతే, ఈ అరుదైన బైకాల్ టీల్ అనేది అద్భుతమైన రూపంతో ఉండే చిన్న బాతు. మగ పక్షి 39 నుండి 43 సెం.మీ పొడవు, 360 నుండి 520 గ్రాముల బరువు ఉంటుంది. ఆడ పక్షి 400 నుండి 500 గ్రాముల బరువు ఉంటుంది. మగ బైకాల్ టీల్ తలపై గోధుమ రంగు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు రంగుల ప్రత్యేక సారాలు కలిగి ఉంటుంది. మగ పక్షి తల ఆడపక్షి కంటే పెద్దది. బైకాల్ టీల్ నదులు, సరస్సులు, చెరువులు, అడవులకు దగ్గరగా ఉన్న చిత్తడి నేలలలో కనిపిస్తుంది. ఈ టీల్ జాతులు విత్తనాలు, ధాన్యాలు, ఆకులు, కాండం, గడ్డి, జల మొక్కలు, నత్తలు వంటివి ఆహారంగా తింటాయి. ఈ టీల్ జాతులు ఏప్రిల్-మేలో సంతానోత్పత్తి ప్రదేశాలకు చేరుకుంటాయి.

ఇవి కూడా చదవండి

బైకాల్ టీల్ జాతులు వలస పక్షులు. ఇవి రష్యాలోని తూర్పు సైబీరియాలో సంతానోత్పత్తి చేస్తాయి. మంగోలియా, ఉత్తర కొరియా గుండా జపాన్, దక్షిణ కొరియా, చైనా ప్రధాన భూభాగంలో చలికాలం వరకు వెళతాయి. ఈ టీల్ జాతులు భారత ఉపఖండం, తైవాన్, హాంకాంగ్‌లకు అరుదైన శీతాకాలంలో వచ్చే సందర్శకులు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..