- Telugu News Photo Gallery Do You Know About These Amazing Health Benefits Of Eating Strawberries Telugu News
Strawberry: స్ట్రాబెర్రీ పండ్ల అద్భుత ప్రయోజనాలు.. తెలుసుకుంటే తినకుండా ఉండలేరు!
స్ట్రాబెర్రీ పండ్లలో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది నేచురల్ షుగర్‌గా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీ పండులోని సహజ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించేలా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కేవలం ఒక కప్పు స్ట్రాబెర్రీలు శరీరానికి కావాల్సినంత విటమిన్-సీని అందిస్తాయి. మరెన్నో పోషకాలు నిండిన ఈ పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 16, 2024 | 4:42 PM

స్ట్రాబెర్రీలలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లలో ఆంథోసైనిన్స్‌తో పాటు విటమిన్-సి ఉంటుంది. యాంటిఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, కణజాల నష్టాన్ని తగ్గించడం ద్వారా కాలక్రమేణా దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఒక కప్పు స్ట్రాబెర్రీలు శరీరానికి కావాల్సినంత విటమిన్-సి ని అందిస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థ కణాలకు మద్దతు ఇస్తుంది. విటమిన్-సి టి కణాలు, బి-కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇవి తెల్ల రక్త కణాలు, వ్యాధిని కలిగించే వైరస్‌లు, బ్యాక్టీరియా, క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి.

స్ట్రాబెర్రీలలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీ పండులోని సహజ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వల్ల కలిగే మంటను తగ్గిస్తాయని అంతేకాకుండా శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించగలవని పరిశోధకులు సూచిస్తున్నారు

ఇతర పండ్లతో పోలిస్తే స్ట్రాబెర్రీలలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ తక్కువ శాతం ఉంటుంది. ఉదాహరణకు, ఒక కప్పు ద్రాక్షలో 23 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. ఒక కప్పు స్ట్రాబెర్రీలు 7 గ్రాముల సహజ చక్కెరను అందిస్తాయి. అందుకే డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఇది ఉత్తమమైన ఎంపిక.

కంటి ఆరోగ్యానికి స్ట్రాబెర్రీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ కంటి శుక్లాలను నివారించడంతో, అంధత్వాన్ని దూరం చేయడంలో క్రీయశీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ సి.. ఫ్రీరాడికల్స్ నుంచి కళ్లను కాపాడుతుంది. క్రమం తప్పుకుండా స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి సమస్యలను చెక్ పెట్డవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.




