- Telugu News Photo Gallery Use Potato Face Packs For Clear Fair Glowing Pigmentation Acne Free Skin Telugu News
Skin Care: బంగాళదుంపల్లో దాగి ఉన్న సౌందర్య రహస్యం.. తెలిస్తే షాకవుతారు..
మనం నిత్యం వండుకునే కూరగాయల్లో బంగాళదుంప ఒకటి..అయితే, ఎప్పుడైనా మీ చర్మం కోసం బంగాళాదుంపలను ప్రయత్నించారా..? ఆహారంలో ఉపయోగించే బంగాళాదుంప ముఖాన్ని ఎలా ప్రకాశవంతం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. మొటిమల మచ్చలు, ముడతలు, వదులైన చర్మం, జిడ్డుగల చర్మంతో సహా ఇతర చర్మ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి బంగాళాదుంప ఉపయోగపడుతుంది.
Updated on: Jan 16, 2024 | 3:47 PM

బంగాళాదుంపల్లో విటమిన్-సీ ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ముఖంపై వృద్ధాప్యం, ముడతలతో సహా మొటిమల మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇది అజెలాక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేసే లక్షణాలకు ప్రసిద్ది చెందింది. ముఖాన్ని కాంతివంతం చేయడానికి బంగాళాదుంప రసాన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

బంగాళాదుంప రసాన్ని ముఖానికి పూయడం వల్ల నల్ల మచ్చలు, సన్నని గీతలు, నిస్తేజమైన చర్మంతో సహా ఇతర చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచూ కళ్ల కింద నల్లటి వలయాలు, ముడతలు పడటం వల్ల ముఖంపై కాంతి తగ్గుతుంది. ప్రకాశవంతమైన చర్మం కావాలంటే బంగాళాదుంప రసాన్ని ముఖానికి అప్లై చేయాలి.

మొటిమల మచ్చలు సాధారణంగా త్వరగా పోవు. దీన్ని తొలగించడానికి బంగాళాదుంప రసం ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఏదైనా ఫేస్‌మాస్క్ తయారు చేసేటప్పుడు అందులో బంగాళాదుంప రసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.

ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల బంగాళాదుంప రసం తీసుకోవాలి. అందులో తేనె మిక్స్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ముఖం కడుక్కోవాలి. ఫినిష్ చేసిన పేస్ట్‌ను నేరుగా ముఖానికి అప్లై చేయాలి. మీరు ఈ పేస్ట్‌ను మెడకు కూడా అప్లై చేయవచ్చు. పేస్ట్ అప్లై చేసిన తర్వాత ముఖానికి మసాజ్ చేయాలి. తయారు చేసిన పేస్ట్‌ను ముఖానికి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్‌మాస్క్‌ను వారానికి 4 సార్లు ఉపయోగించవచ్చు.

బంగాళాదుంపలు ఇనుము, విటమిన్-సి, రిబోఫ్లేవిన్‌కు గొప్ప మూలం. ఇది వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ముడతలను కూడా తొలగిస్తుంది. బంగాళాదుంప రసం నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది వదులైన చర్మం చిక్కగా మారడానికి కారణమవుతుంది. దీనితో మొండి టాన్‌ను తొలగిస్తుంది.




