- Telugu News Photo Gallery Cricket photos Gujarat Titans Coach Ashish Nehra Declined For A Job Says Yuvraj Singh
Team India: జీటీలో జాబ్ అడిగితే, ఆశిష్ నెహ్రా హ్యాండ్ ఇచ్చాడు: యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
IPL 2024, Yuvraj Singh: ఐపీఎల్‌లో సిక్సర్ల కింగ్ యువరాజ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్, పూణే వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తరపున యువరాజ్ సింగ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా జట్ల తరపున మొత్తం 132 మ్యాచ్‌లు ఆడిన ఈ టీమిండియా మాజీ ప్లేయర్.. 2750 పరుగులు, 36 వికెట్లు సాధించాడు.
Updated on: Jan 16, 2024 | 3:45 PM

T20 క్రికెట్ స్పెషలిస్ట్, సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) IPLకి తిరిగి రాబోతున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే, యూవీ ఇప్పటికే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఎన్ఓసీ పొందాడు. అందువల్ల యువరాజ్ సింగ్ ఐపీఎల్‌లో ఆటగాడిగా కనిపించడానికి అనుమతి ఉండదు.

అయితే, యువరాజ్ సింగ్ కొత్త బాధ్యతతో ఐపీఎల్‌లో కనిపించాలనుకుంటున్నాడు. అంటే, ఏదైనా టీమ్‌కి మెంటార్‌గా పనిచేయాలనుకుంటున్నాడు. ఇందుకోసం తెరవెనుక ప్రయత్నాలు కూడా చేశారు.

ఈ విషయాన్ని స్వయంగా యువరాజ్ సింగ్ ప్రకటించాడు. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉద్యోగం కోసం కోచ్ ఆశిష్ నెహ్రాను సంప్రదించాను. అయితే, ఆయన దానిని ఖండించారు. అందువల్ల ఐపీఎల్‌లో కొత్త ఇన్నింగ్స్‌లు ప్రారంభించడం సాధ్యం కాలేదని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం నా ప్రాధాన్యత నా పిల్లలే. వారు పాఠశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు నాకు ఎక్కువ సమయం ఉంటుంది. అందుకే రానున్న రోజుల్లో మళ్లీ క్రికెట్‌లోకి రాబోతున్నాను. ముఖ్యంగా నా రాష్ట్రానికి చెందిన అబ్బాయిలతో కలిసి పనిచేయడం ఇష్టం. వారికి మార్గనిర్దేశం చేసి అత్యుత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అని యువరాజ్ సింగ్ తెలిపాడు.

నేను కూడా ఐపీఎల్ టీమ్‌ల కోసం పని చేసేందుకు ఎదురుచూస్తున్నాను. కాబట్టి, రాబోయే రోజుల్లో నేను కూడా మెంటార్ హోదాలో కనిపించగలనని యువరాజ్ సింగ్ అన్నాడు. అందుకే ఐపీఎల్ లో మళ్లీ కొత్త బాధ్యతతో సిక్సర్ కింగ్ కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, పుణె వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తరపున మొత్తం 132 మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ సింగ్ 2750 పరుగులు, 36 వికెట్లు సాధించాడు.





























