- Telugu News Photo Gallery Cricket photos India's Probable Playing XI For The 3rd T20I vs Afghanistan samson in mukesh out
IND vs AFG: మూడు మార్పులతో బరిలోకి.. చివరి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..
India vs Afghanistan: మొహాలీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండోర్‌లో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని 2-0తో కైవసం చేసుకుంది. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో కనిపించలేదు. తద్వారా మూడో మ్యాచ్‌లో రవి బిష్ణోయ్‌కు బదులుగా కుల్దీప్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభించవచ్చు.
Updated on: Jan 17, 2024 | 6:30 AM

రేపు (జనవరి 17న) భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) మధ్య 3వ టీ20 మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో టీమ్ ఇండియా ఉంది.

తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా మూడో మ్యాచ్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. దీని ప్రకారం తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం లభించని ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొనవచ్చు.

ఇక్కడ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ అయినప్పటికీ శాంసన్‌కు బదులుగా జితేష్ శర్మకు తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం కల్పించారు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో జితేష్ తప్పుకునే అవకాశం ఉంది. అతని స్థానంలో సంజూ శాంసన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఫీల్డింగ్‌లో ఉండే అవకాశం ఉంది.

సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో కనిపించలేదు. తద్వారా మూడో మ్యాచ్‌లో రవి బిష్ణోయ్‌కు బదులుగా కుల్దీప్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభించవచ్చు. అలాగే, తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన ముఖేష్ కుమార్ మూడో మ్యాచ్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. అతడి స్థానంలో అవేశ్ ఖాన్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఈ మూడు మార్పులతో అఫ్గానిస్థాన్‌తో జరిగే 3వ మ్యాచ్‌లో టీమిండియా బరిలోకి దిగనుంది.

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్.

టీ20 టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), యస్సావి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, కుల్‌దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, విరాట్ కోహ్లీ.




