- Telugu News Photo Gallery Cricket photos Team India Captain Rohit Sharma Can Break MS Dhoni's Captaincy Record in ind vs afg 3rd t20i
Rohit Sharma: మూడో టీ20లో భారత్ గెలిస్తే.. హిట్‌మ్యాన్ ఖాతాలో సరికొత్త రికార్డ్.. తొలి భారత సారథిగా..
India vs Afghanistan: మొహాలీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఇండోర్‌లో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని 2-0తో కైవసం చేసుకుంది. నేడు బెంగళూరు వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత సారథి రోహిత్ శర్మ ఓ స్పెషల్ రికార్డ్ నెలకొల్పే అవకాశం ఉంది.
Updated on: Jan 17, 2024 | 3:00 PM

ఈరోజు (జనవరి 17) భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట కొత్త రికార్డు చేరినట్లే. ధోనీని అధిగమించడం కూడా విశేషం.

అంటే, టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు భారత జట్టును విజయవంతంగా నడిపించిన రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. క్రికెట్‌లో 72 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా కనిపించిన ధోనీ.. భారత జట్టుకు 41 విజయాలు అందించాడు.

అయితే, ఇండోర్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లో ధోనీ 41 విజయాల రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశం ఉంది.

టీ20 క్రికెట్‌లో 53 మ్యాచ్‌ల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన రోహిత్ శర్మ మొత్తం 41 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. ఇప్పుడు బెంగుళూరు వేదికగా జరిగే మ్యాచ్‌లో గెలిస్తే భారత్ టీ20 జట్టుకు సక్సెస్ ఫుల్ కెప్టెన్ అవుతాడు.

అలాగే, టీ20 క్రికెట్‌కు విజయవంతమైన కెప్టెన్లుగా ఉన్న ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్), బాబర్ ఆజం (పాకిస్థాన్), అస్గర్ ఆఫ్ఘన్ (ఆఫ్ఘనిస్థాన్) రికార్డులను సమం చేస్తాడు. ఈ ముగ్గురి సారథ్యంలో ఆయా జట్లు 42 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇప్పుడు ఈ ప్రపంచ రికార్డును రోహిత్ శర్మ సమం చేసే అవకాశం ఉంది.




