- Telugu News Photo Gallery Cricket photos Pakistan wicket Keeper Mohammad Rizwan completed the double without a bat in hand trolls on social media In NZ Vs PAK Match
NZ Vs PAK: ఓర్నీ ఏశాలో.. ఇదేం పోయేకాలం రిజ్వాన్.. ఇలా కూడా రన్నింగ్ చేస్తారా.. ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..
New Zealand vs Pakistan: ఇలాంటి తప్పు చేసిన మహ్మద్ రిజ్వాన్ ఇప్పుడు ట్రోల్స్ బారిన పడ్డాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇచ్చిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పోయిన పాక్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే న్యూజిలాండ్ 2-0 తేడాతో గెలుచుకుంది.
Updated on: Jan 17, 2024 | 4:22 PM

Mohammad Rizwan: పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుల పాలవుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాడు చేసిన తప్పిదమే ఇందుకు ప్రధాన కారణంగా మారింది.

డునెడిన్‌లోని యూనివర్సిటీ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ జట్టు కోసం మహ్మద్ రిజ్వాన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

అందుకు తగ్గట్టుగానే పాక్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో పరుగు కోసం ప్రయత్నిస్తున్న రిజ్వాన్ చేతి నుంచి బ్యాట్ కిందపడింది. అయితే, అతను క్రీజులోకి చేరుకున్న రిజ్వాన్ తన చేతితో గీతను తాకి రెండో పరుగును పూర్తి చేశాడు.

కానీ, నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో మహ్మద్ రిజ్వాన్ గ్లవ్స్ క్రీజును తాకలేదు. దీంతో పరుగు కట్ అయింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక్కడ బ్యాట్ లేకపోయినా.. మహ్మద్ రిజ్వాన్ తన చేతితో క్రీజును తాకే ప్రయత్నం చేస్తూ హాస్యాస్పదంగా కనిపిస్తున్నాడు. అంటే, నేరుగా పరిగెత్తి క్రీజును కాళ్లతో తాకినా ఒక్క పరుగు వచ్చేది. అయితే, రిజ్వాన్ వంగి మరీ క్రీజును చేతులతో తాకే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇలాంటి తప్పు చేసిన మహ్మద్ రిజ్వాన్ ఇప్పుడు ట్రోల్స్ బారిన పడ్డాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇచ్చిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పోయిన పాక్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.




