- Telugu News Photo Gallery Cricket photos Former Pakistan wicket keeper Moeen Khan son Azam Khan Has 19 Runs From Seven T20Is fans fire on social media
T20 Cricket: తండ్రి అండతో జాతీయ జట్టులో చోటు.. 7 మ్యాచ్‌ల్లో 19 పరుగులే.. ఏకిపారేస్తోన్న మాజీలు..
Azam Khan: ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పాకిస్తాన్ యంగ్ ప్లేయర్ ఆజం ఖాన్.. తొలి మ్యాచ్‌లో 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 2వ మ్యాచ్‌లో కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. ఇలా ఇప్పటి వరకు మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడినా ఇంతటి పేవలమైన ఆటతీరుతో ఎంతమంది ఆటగాళ్లు ఉన్నారంటూ మాజీలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
Updated on: Jan 16, 2024 | 3:45 PM

పాకిస్థాన్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అజం ఖాన్ (Azam Khan) ఎంపికపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అతని పేలవమైన ఆటతీరు. అంటే గత 7 టీ20 మ్యాచ్‌ల్లో ఆజం ఖాన్ 19 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వీడెవండీ బాబూ అంటూ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆజం ఖాన్ తొలి మ్యాచ్‌లో 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 2వ మ్యాచ్‌లో కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు.

ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సున్నాకే ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 2వ మ్యాచ్‌లో కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. ఆజం ఖాన్ ఇప్పుడు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడుతున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 10 పరుగులు చేసిన ఆజం.. 2వ మ్యాచ్‌లో 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంటే 7 మ్యాచ్‌ల్లో 3.8 చొప్పున పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇప్పటివరకు అజమ్ బ్యాట్‌తో 2 ఫోర్లు మాత్రమే బాదాడు.

అయితే, ఆజం ఖాన్‌కు జాతీయ జట్టులో చోటు కల్పించడంపై పాక్ అభిమానులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఇంజిమాబ్ అనుకుంటే, ఇంతలా విఫలమవుతున్నాడేంట్రా బాబూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆజం ఖాన్ పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ కుమారుడు. పాకిస్థాన్ చరిత్రలో ఏడు మ్యాచ్‌ల్లో 19 పరుగులు చేసిన ఆటగాళ్లు ఎంత మంది? అంటూ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జట్టు నుంచి తప్పించాలంటూ విమర్శలు గుప్పిస్తున్నాడు.





























