Watch Video: మొసళ్ల మధ్యలో చిక్కుకున్న జీబ్రా.. మెడపట్టుకుని ఈడ్చుకెళ్తుంటే..! చివరకు ఏం జరిగిందో ఊహించలేరు..
అసలేం జరిగిందంటే, మొసళ్లతో నిండిన చెరువులో జీబ్రా చిక్కుకుపోయింది. ఆ తర్వాత మొసళ్లు దానిపై దాడి చేశాయి. ఓ మొసలి దాని తల పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మరోకటి దాని కాలుపై దాడి చేస్తుంది..దాంతో ఆ జీబ్రా తప్పించుకునే మార్గం లేక.. నీటిలో పడిపోయింది..మొసళ్లన్నీ చుట్టుముట్టి జీబ్రాపై దాడి చేస్తున్నాయి... కానీ, అది అధైర్యపడకుండా..ధైర్యం ప్రదర్శించింది.
అడవి జంతువులు అనే మాటలు ఎక్కడైనా వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది సింహాలు, పులులు, చిరుతపులులు. ఎందుకంటే అవి అడవిలో అత్యంత భయంకరమైన జంతువులుగా చెబుతారు. అందుకే ప్రజలు ఈ జంతువులకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఎందుకంటే వాటికి చిక్కిన వారు ఎవరైనా సరే.. ప్రాణాలు వదులుకోవాల్సిందే.. అలాంటి క్రూరమృగాలు కొన్ని నీటిలో నివసించేవి కూడా ఉన్నాయి. వీటిలో మొదటి పేరు మొసలిది. మానవులు, జంతువులు ఇద్దరూ కూడా మొసళ్లకు దూరంగా ఉండాల్సిందే.. కానీ కొన్నిసార్లు మనుషులు, అడవి జంతువులు అనుకోకుండా మొసళ్ల బారిన పడుతుంటాయి. ఈ రోజుల్లో, అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు.
అసలేం జరిగిందంటే, మొసళ్లతో నిండిన చెరువులో జీబ్రా చిక్కుకుపోయింది. ఆ తర్వాత మొసళ్లు దానిపై దాడి చేశాయి. ఓ మొసలి దాని తల పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మరోకటి దాని కాలుపై దాడి చేస్తుంది..దాంతో ఆ జీబ్రా తప్పించుకునే మార్గం లేక.. నీటిలో పడిపోయింది..మొసళ్లన్నీ చుట్టుముట్టి జీబ్రాపై దాడి చేస్తున్నాయి… కానీ, అది అధైర్యపడకుండా..ధైర్యం ప్రదర్శించింది. మొసళ్ల బారిలో చిక్కుకుపోయినా ధైర్యం ప్రదర్శించి జలభూతాలను ఓడించి తన ప్రాణాలను కాపాడుకుంది..
— NATURE IS BRUTAL (@TheBrutalNature) January 15, 2024
మనసును కదిలించే ఈ వీడియో @TheBrutalNature అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. కేవలం 42 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 17 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు.
అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒక వినియోగదారు ‘జీబ్రా నిజంగా తన ప్రాణాలను కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడింది’ అని రాస్తే, మరొక వినియోగదారు ‘ఒకరు ధైర్యాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు’ అని రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..