Railway New Rules: కీలమైన రూల్స్ మార్చిన ఇండియన్ రైల్వేస్.. ఆ తప్పు చేస్తూ పట్టుబడితే ఇక అంతే సంగతులు
కొన్ని రాష్ట్రాలు మద్యపాన నిషేధం పాటిస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు మద్యం విషయంలో కఠిన నియమాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అయితే మాత్రం ఇతర రాష్ట్ర మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. ఒక బాటిల్ కంటే ఎక్కువ ఇతర రాష్ట్ర మద్యంతో పట్టుబడితే మాత్రం ఎక్సైజ్ శాఖ కఠి చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో రైళ్లు అంటే ఓ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తూ ఇలాంటి సమయంలో ఆయా రాష్ట్రాల మద్యంతో రైళ్లల్లో పట్టుబడితే ఏం చేస్తారు? అనేది చాలా మందికి తెలియదు.

భారతదేశంలో రైల్వే ప్రయాణం అనేది చవకైన ప్రయాణంగా అవతరించింది. సాధారణంగా భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం. ఇంత మంది ప్రజలు రవాణా సంబంధిత సమస్యలను తీర్చడంలో భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల నియమాలు మాత్రం వేరుగా ఉంటాయి. ముఖ్యంగా మద్యం విషయంలో ఈ నియమాలు కచ్చితంగా వేరుగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు మద్యపాన నిషేధం పాటిస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు మద్యం విషయంలో కఠిన నియమాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అయితే మాత్రం ఇతర రాష్ట్ర మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. ఒక బాటిల్ కంటే ఎక్కువ ఇతర రాష్ట్ర మద్యంతో పట్టుబడితే మాత్రం ఎక్సైజ్ శాఖ కఠి చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో రైళ్లు అంటే ఓ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తూ ఇలాంటి సమయంలో ఆయా రాష్ట్రాల మద్యంతో రైళ్లల్లో పట్టుబడితే ఏం చేస్తారు? అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి మద్యం విషయంలో భారతీయ రైల్వేలు పాటించే కీలక నియమాలు గురించి ఓ సారి తెలుసుకుందాం.
ప్రయాణికుల సౌలభ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే రైలులో మద్యంతో సహా కొన్ని వస్తువులను తీసుకెళ్లడంలో నిషేధం విధించాయి. ప్రయాణికులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. రైలులో మద్యం సేవించి ప్రయాణించడం కూడా పూర్తిగా నిషేధం. అలా చేసినందుకు రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 165 ప్రకారం ప్రయాణికుడిపై చర్య తీసుకోవచ్చు. ఇందులో రూ. 500 వరకు జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. అదనంగా ప్రయాణికుల టిక్కెట్‌ను కూడా రద్దు చేయవచ్చు. అయితే భారతదేశంలోని బీహార్, గుజరాత్, మిజోరాం మరియు నాగాలాండ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మద్య నిషేధం ఖచ్చితంగా అమలు చేయబడింది. ఈ రాష్ట్రాల్లో ప్రయాణికులు మద్యంతో పట్టుబడితే కఠినమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి రైళ్లల్లో మద్యం తరలింపు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.




