AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tickets: ట్రైన్ టిక్కెట్ ఛార్జీలు ఎలా నిర్ణయిస్తారు? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమాచారం..

ఎక్కువగా రైలులో ప్రయాణించే వారికి ఈ వార్త ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ప్రయాణించే రైలు ఛార్జీని ఎలా లెక్కిస్తారో తెలుసా? వెబ్‌సైట్ లేదా యాప్‌లో మీరు చూస్తున్న ఛార్జీ దేని ఆధారంగా లెక్కించబడుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఏ ప్రాతిపదికన ట్రైన్ టిక్కెట్ రేట్లను నిర్ణయిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

IRCTC Tickets: ట్రైన్ టిక్కెట్ ఛార్జీలు ఎలా నిర్ణయిస్తారు? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమాచారం..
Train
Shiva Prajapati
|

Updated on: Apr 23, 2023 | 6:42 AM

Share

ఎక్కువగా రైలులో ప్రయాణించే వారికి ఈ వార్త ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ప్రయాణించే రైలు ఛార్జీని ఎలా లెక్కిస్తారో తెలుసా? వెబ్‌సైట్ లేదా యాప్‌లో మీరు చూస్తున్న ఛార్జీ దేని ఆధారంగా లెక్కించబడుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఏ ప్రాతిపదికన ట్రైన్ టిక్కెట్ రేట్లను నిర్ణయిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దేశాన్ని ఒక మూల నుంచి మరో మూలకు కలిపే ఏకైక ప్రయాణ సాధనం రైలు మార్గం. దీని ప్రయాణం ఇతర మార్గాల కంటే చాలా చౌకగా ఉంటుంది. అయితే, ఏ ప్రయాణం అయినా ఛార్జీలు చెల్లించాల్సిందే. ట్రైన్ ట్రావెలింగ్‌కు కూడా ఛార్జీలు ఉంటాయి. అయితే, ట్రైన్ టైప్‌ని బట్టి ఈ ఛార్జీలు ఉంటాయి. శతాబ్ది రైళ్లకు ప్రత్యేక ఛార్జీలు ఉంటాయి. ఇక రాజధాని, ఎక్స్‌ప్రెస్, ఇతర రైళ్లకు వేర్వేరు ఛార్జీలు ఉన్నాయి. ఇక వీటిలో దూరాన్ని బట్టి ఛార్జీలు, రిజర్వేషన్ ఛార్జీ, GST, అనేక ఇతర అంశాల ఆధారంగా రైలు టిక్కెట్ ఛార్జీలు నిర్ణయించడం జరుగుతుంది.

ఛార్జీలను ఈ విధంగా గణిస్తారు..

రైలు ఛార్జీల గణనలో కిలోమీటర్ అతిపెద్ద అంశం. అంటే, మీరు ప్రయాణించాల్సిన దూరం అతిపెద్ద అంశం. రైలు ఛార్జీల దూరం అనేక వర్గాలుగా విభజించడం జరిగింది. 1 5, 6 10, 11 15, 16 20, 21 25, 4,951 5,000 కిలోమీటర్ల కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఇలా ప్రయాణించే దూరాన్ని బట్టి ఛార్జీలు నిర్ణయించబడతాయి.

ఇవి కూడా చదవండి

అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు..

రైలు ఛార్జీల పూర్తి వివరాలు భారతీయ రైల్వే వెబ్‌సైట్‌లో ఉన్నాయి. కావాలంటే, అక్కడ నుండి ఛార్జీల వివరాలను పరిశీలించొచ్చు. ఇందుకోసం, భారతీయ రైల్వే వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత.. రైల్వే బోర్డు విభాగంపై క్లిక్ చేయాలి. అక్కడ మీకు కోచింగ్ విభాగంలో ఛార్జీల గురించి సమాచారం వస్తుంది.

బస్సు, టాక్సీల కంటే రైలు ప్రయాణం చాలా చౌక..

బస్సు, టాక్సీ, ఇతర పబ్లిక్ ట్రావెలింగ్ ఛార్జీలతో పోలిస్తే.. రైలులో ప్రయాణించడం చాలా చౌకగా మారుతుంది. ఇందులో టోల్, పెట్రోల్ పేరుతో ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. మీరు లక్నో నుండి ఢిల్లీకి క్యాబ్‌లో వస్తున్నారనుకోండి.. అప్పుడు మీరు కనీసం రూ. 8 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, ట్రైన్‌లో కేవలం 6 గంటల్లోనే, అది కూడా రూ.1000 నుంచి 1,200 లతో ఢిల్లీ చేరుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..