AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Male Infertility: అలాంటి ఫుడ్ తింటే మగాళ్ళలో స్పెర్మ్ కౌంట్ ఫట్.. ఇవిగో డీటైల్స్

ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే రసాయనాల సమ్మేళనాల్లో ఒకటి.. ఆర్గానోఫాస్ఫేట్లు పురుగుల మందు. దీనిని కలుపు సంహారకానికి కూడా ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే రక రకాల తెగుళ్ల నియంత్రణ కోసం వివిధ రకాల పొలాల్లో పండే పండ్లు, కూరగాయలకు పురుగుమందులను తయారు చేయడానికి ఆర్గానోఫాస్ఫేట్‌లను ఉపయోగిస్తారు. పురుషుల సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేసే అంశాలను అధ్యయనం చేసే సమయంలో రసాయనాయలను వినియోగం వలన కలిగే ప్రతికూల ప్రభావాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Male Infertility: అలాంటి ఫుడ్ తింటే మగాళ్ళలో స్పెర్మ్ కౌంట్ ఫట్.. ఇవిగో డీటైల్స్
Male Infertility
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 17, 2024 | 12:15 PM

Share

రోజు రోజుకీ పెరుగుతున్న జనాభా.. అందుకు తగిన విధంగా పెరగాల్సిన ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. దీంతో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఇలా ప్రతి ఆహారాన్ని తక్కువ సమయంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడానికి రకరకాల రసాయనాలను వినియోగిస్తున్నారు. అయితే ఈ రసాయనాలను ఇళ్లు, తోటలు, పచ్చిక బయళ్లలో, ఆహారంలో ఉపయోగించే పురుగు మందులను పీల్చడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ అనూహ్యంగా తగ్గుముఖం పడుతోంది. దీని కారణంగా  పురుషుల్లో వంధ్యత్వం పెరుగుతోందని ఓ అధ్యయనంలో పేర్కొన్నారు. ఎన్విరాన్‌మెంటల్ హెల్త్పెర్స్‌పెక్టివ్స్ అనే జర్నల్‌లో ప్రచురించబడింది.

గత 50 ఏళ్లలో జరిపిన అధ్యయనాల కొత్త విశ్లేషణ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం పురుషుల్లో స్పెర్మ్  కౌంట్ పడిపోయింది” అని వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్‌లోని జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ సీనియర్ అధ్యయన రచయిత్రి మెలిస్సా పెర్రీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే రెండు సాధారణ పురుగుమందులు ఆర్గానోఫాస్ఫేట్, ఎన్-మిథైల్ కార్బమేట్ దీనికి కారణం అని.. ఈ  రసాయనాలు పురుషుల పట్ల తెలియని అపరాధిగా మారాయని పెర్రీ చెప్పారు.

ఎక్కువగా పురుగులు మందులు ఉపయోగిస్తే..

ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే రసాయనాల సమ్మేళనాల్లో ఒకటి.. ఆర్గానోఫాస్ఫేట్లు పురుగుల మందు. దీనిని కలుపు సంహారకానికి కూడా ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే రక రకాల తెగుళ్ల నియంత్రణ కోసం వివిధ రకాల పొలాల్లో పండే పండ్లు, కూరగాయలకు పురుగుమందులను తయారు చేయడానికి ఆర్గానోఫాస్ఫేట్‌లను ఉపయోగిస్తారు. పురుషుల సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేసే అంశాలను అధ్యయనం చేసే సమయంలో రసాయనాయలను వినియోగం వలన కలిగే ప్రతికూల ప్రభావాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకని పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గి సంతానోత్పత్తి తగ్గుతోందని.. పిల్లలు పుట్టే అవకాశం కూడా రోజు రోజుకీ తగ్గుముఖం పడుతోందని పెర్రీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఎక్కువ ఎవరు ప్రమాదంలో ఉన్నారంటే..

అధ్యయనం ప్రకారం ఆర్గానోఫాస్ఫేట్‌లు, ఎన్-మిథైల్ కార్బమేట్‌ వంటి పురుగుమందులను ఉపయోగించే ఆహారాన్ని తిన్నా.. వ్యవసాయం చేసే సమయంలో ఈ పెస్టిసైడ్స్ ని ఉపయోగిస్తున్నా.. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని తెలుస్తోంది. ఈ పురుగుమందులోని రసాయనాలు పురుషుల్లోని సెక్స్ హార్మోన్లు నేరుగా ప్రభావితం చేయడంతో పాటు వృషణ కణాలను దెబ్బతీయడం, స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపే మెదడు న్యూరోట్రాన్స్‌మిటర్‌లపై ప్రభావం చూపిస్తున్నాయని.. తాము జంవుతుల మీద చేసిన అధ్యయనం ద్వారా వెల్లడైందని చెప్పారు.

స్పెర్మ్ కౌంట్ విషయంలో ఏమి చేయాలంటే

పురుగుమందుల విషయంలో వినియోగదారులు తీసుకోగల చర్యలు ఉన్నాయి. సేంద్రీయ ఆహారాన్ని ఎంచుకోవాలి. సేంద్రీయ ఆహారాలు ఎక్కువ పోషకమైనవి.. పురుగుమందుల అవశేషాలు చాలా తక్కువగా ఉంటాయి. అలెక్సిస్ టెమ్కిన్, ఎన్విరాన్‌మెంటల్ వర్కింగ్ గ్రూప్‌లోని టాక్సికాలజిస్ట్ ప్రకారం, వినియోగదారు ఆరోగ్యం, విష రసాయనాలు, కాలుష్య కారకాలపై దృష్టి సారించే పరిశోధన లాభాపేక్షలేనిది.

ఎన్విరాన్‌మెంటల్ వర్కింగ్ గ్రూప్ వినియోగదారులు షాపింగ్ చేయడానికి ఉపయోగించే ఆహార ఉత్పత్తుల లిస్ట్ ని రూపొందించింది. తక్కువ పురుగుమందులతో నాన్ ఆర్గానిక్ ఉత్పత్తుల వార్షిక జాబితాను రూపొందిస్తుంది. పరిశోధకులు 12 ఆహారాలపై 210 రకాల పురుగుమందులను కనుగొన్నారు.

పురుగుల మందు అవశేషాల ప్రభావం తగ్గించేందుకు చిట్కాలు

తాజా ఉత్పత్తులతో ఆహారాన్ని రెడీ చేయడానికి ముందు తర్వాత 20 సెకన్ల పాటు వేడి నీరు, సబ్బుతో చేతులు కడుక్కోవాలి.

కూరగాలను తినే ముందు ఉత్పత్తులను శుభ్రం చేయండి. వాటి మీద మురికి, బ్యాక్టీరియాలు లేకుండా పండ్లు, కూరగాయలు శుభ్రపడతాయి.

ఆపిల్, సీతాఫలాల వంటి దృఢమైన ఉత్పత్తులను స్క్రబ్ చేయడానికి శుభ్రమైన కూరగాయల బ్రష్‌ను ఉపయోగించడం.

ఉత్పత్తిని శుభ్రమైన బట్టతో లేదా కాగితపు టవల్‌తో తుడిచి ఆరబెట్టడం వల్ల బ్యాక్టీరియాను మరింత తగ్గించవచ్చు.

అయితే ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఎక్కువ మందిని ఆర్గానిక్ పుడ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. సేంద్రీయ ఎరువులను ఉపయోగించి పండిస్తున్న బియ్యం, పప్పులు, కూరగాయలు, పండ్లు వంటి వస్తువులను ఉపయోగిస్తున్నారు. ఇవి కొంచెం ఖరీదైనవి అయితే ఆరోగ్యంకంటే మాత్రం కాదు కదా..!

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..