Gas Booking: వాట్సాప్‌లోనే గ్యాస్‌ బుకింగ్‌.. ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు.

ఇలాంటి వాటిలో గ్యాస్‌ బుకింగ్‌ సేవలు ఒకటి. సాధారణంగా గ్యాస్‌ సిలిండర్ బుక్‌ చేసుకోవాలంటే.. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌ నెంబర్‌ నుంచి కాల్‌ చేయడం లాంటి ప్రాసెస్‌ ఉంటుంది. అయితే వాట్సాప్‌ ద్వారా సింపుల్‌గా గ్యాస్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇంతకీ వాట్సాప్‌ ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ ఎలా బుక్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Gas Booking: వాట్సాప్‌లోనే గ్యాస్‌ బుకింగ్‌.. ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు.
Gas Booking
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 07, 2024 | 1:56 PM

ప్రస్తుతం వాట్సాప్‌ ఉపయోగం అనివార్యంగా మారింది. వాట్సాప్‌ లేని స్మార్ట్‌ ఫోన్‌ ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా వాట్సాప్‌ క్రేజ్‌ సంపాదించుకుంది. వాట్సాప్‌కు ఉన్న ఈ పాపులారిటీని క్యాష్‌ చేసుకునేందుకు పలు సంస్థలు సైతం తమ సేవలను విస్తరించుకునేందుకు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నాయి.

ఇలాంటి వాటిలో గ్యాస్‌ బుకింగ్‌ సేవలు ఒకటి. సాధారణంగా గ్యాస్‌ సిలిండర్ బుక్‌ చేసుకోవాలంటే.. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌ నెంబర్‌ నుంచి కాల్‌ చేయడం లాంటి ప్రాసెస్‌ ఉంటుంది. అయితే వాట్సాప్‌ ద్వారా సింపుల్‌గా గ్యాస్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇంతకీ వాట్సాప్‌ ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ ఎలా బుక్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

హెచ్‌పీ గ్యాస్‌ ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

* ఇందుకోసం ముందుగా మీ రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌లో 9222201222 నెంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి.

* అనంతరం వాట్సాప్‌ ఓపెన్‌ చేసి పైన తెలిపిన నెంబర్‌కు ‘HP GAS BOOK’ అని మెసేజ్‌ పంపించాలి.

* తర్వాత వచ్చే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చు. గ్యాస్‌ బుక్‌ కాగానే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్‌ వస్తుంది.

భారత్ గ్యాస్‌ సిలిండర్‌ ఇలా బుక్‌ చేసుకోండి..

* ఇందుకోసం ముందుగా మొబైల్‌లో ‘భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌’కు చెందిన 1800224344 నెంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి.

* అనంతరం చాట్‌ బాక్స్‌లో నెంబర్‌ను ఓపెన్‌ చేసి ‘BOOK’ లేదా ‘1’ నెంబర్‌ను ఎంటర్ చేసి సెండ్‌ కొట్టాలి. వెంటనే పేమెంట్‌ లింక్‌ వస్తుంది.

ఇండేన్‌ గ్యాస్‌ను ఇలా బుక్‌ చేసుకోండి..

* ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్ ఫోన్‌లో 7588888824 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి.

* అనంతరం మీ రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌ నుంచి పైన తెలిపిన నెంబర్‌కు ‘Refill<16-digit ID> అనే మెసేజ్‌ పంపాలి.

* వెంటనే మీ వాట్సాప్‌కు డిజిటల్‌ పేమెంట్ లింక్‌ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..