Pension Life Certificate: పెన్షనర్లకు అలర్ట్‌.. లైఫ్‌ సర్టిఫికేట్‌ సమర్పించేందుకు గడువు ఎప్పటి వరకో తెలుసా?

ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. రక్షణ పెన్షనర్లు 2023 నవంబర్ 30 నాటికి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంది. కానీ ఇప్పుడు దాని గడువును జనవరి 2024 వరకు పొడిగించారు. వెబ్‌సైట్‌లో పెన్షనర్లు జనవరి 31 లోపు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని కోరారు. అలా చేయడంలో విఫలమైతే వచ్చే నెల నుంచి పెన్షన్

Pension Life Certificate: పెన్షనర్లకు అలర్ట్‌.. లైఫ్‌ సర్టిఫికేట్‌ సమర్పించేందుకు గడువు ఎప్పటి వరకో తెలుసా?
Pension Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Jan 07, 2024 | 10:35 AM

దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. సాధారణంగా ప్రభుత్వం అక్టోబర్ – నవంబర్‌లలో వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి పెన్షనర్లకు గడువు ఇస్తుంది. అయితే రక్షణ పెన్షనర్లకు ఈ గడువు పొడిగించబడింది. డిఫెన్స్ పెన్షనర్లు ఇప్పుడు తమ వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని 31 జనవరి 2024 వరకు సమర్పించవచ్చు. అంతకుముందు దాని చివరి తేదీ 30 నవంబర్ 2023.

రక్షణ పెన్షనర్లకు ప్రత్యేక మినహాయింపు లభించింది:

ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. రక్షణ పెన్షనర్లు 2023 నవంబర్ 30 నాటికి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంది. కానీ ఇప్పుడు దాని గడువును జనవరి 2024 వరకు పొడిగించారు. వెబ్‌సైట్‌లో పెన్షనర్లు జనవరి 31 లోపు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని కోరారు. అలా చేయడంలో విఫలమైతే వచ్చే నెల నుంచి పెన్షన్ నిలిచిపోతుంది. దీని తర్వాత లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత మాత్రమే పెన్షన్ మళ్లీ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు సమర్పించాలి?

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిబంధనల ప్రకారం.. రాష్ట్ర, కేంద్ర పెన్షన్ హోల్డర్లందరూ సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీంతో పెన్షనర్ బతికే ఉన్నాడని రుజువవుతుంది. లైఫ్ సర్టిఫికేట్ ఒక సంవత్సరం మాత్రమే చెల్లుతుంది. ప్రతి సంవత్సరం సమర్పించాలి. మీరు ఇంకా ఈ పనిని పూర్తి చేయకపోతే వీలైనంత త్వరగా పూర్తి చేయండి.

లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి?

లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పెన్షనర్లు బయోమెట్రిక్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఇది కాకుండా జీవిత ధృవీకరణ పత్రాన్ని బ్యాంక్ లేదా పోస్టాఫీసు ద్వారా కూడా సమర్పించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి