Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacobin Cuckoo: ఈ పక్షి సృష్టిలో వెరీ వెరీ స్పెషల్.. ఏడాదిలో ఒక్కసారే నీటిని తాగుతుంది.. అది కూడా నేలకు చేరని వాన చినుకే..

ఈ పక్షి వర్షాకాలంలో పడే మొదటి చినుకుని తాగుతుంది. ఈ చకోర పక్షి ఉత్తర, మధ్య భారతదేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. వర్షపు నీరు అదీ తొలకరి చినుకు పడే సమయంలో పడే నీటిని ఈ పక్షి నీరు తాగుతుంది. అప్పటి వరకూ నీరు లేకుండా రోజుల తరబడి జీవించగలదు. ఈ పక్షికి దాహం వేసినప్పుడు వర్షం కురిపించమంటూ వరుణుడిని ప్రార్ధిస్తుందని భారతీయుల నమ్మకం.

Jacobin Cuckoo: ఈ పక్షి సృష్టిలో వెరీ వెరీ స్పెషల్.. ఏడాదిలో ఒక్కసారే నీటిని తాగుతుంది.. అది కూడా నేలకు చేరని వాన చినుకే..
Jacobin Cuckoo
Follow us
Surya Kala

|

Updated on: Jun 10, 2023 | 12:09 PM

నీరు ప్రతి జీవికి ఆధారం.. నీరు తాగకపోతే కొన్ని రోజుల్లో ప్రాణం పోయే స్టేజ్ కు చేరుకుంటారు. అందుకనే మనుషులు, పశుపక్ష్యాదులకైనా సరే నీరు ప్రాణాధారం. అయితే ఒక జీవి మాత్రం నీటిని ఏడాదిలో ఒక్కసారి మాత్రమే తాగుతుంది. అది కూడా ప్రత్యేక సందర్భంలో మాత్రమే నీటిని తాగుతుంది. ఆ జీవీ జాకోబిన్ కోకిల.

జాకోబిన్ కోకిల భూమిపై ఉన్న ప్రత్యేకమైన జీవులలో ఒకటి. పైడ్ క్రెస్టెడ్ కోకిల లేదా చాతక పక్షి లేదా చకోర పక్షి అని కూడా అంటారు. ఈ పక్షి వర్షపు నీటి బిందువులను నేరుగా మాత్రమే తాగుతుంది. ఎంత దాహం వేసినా సరే ఈ పక్షి మరే ఇతర నీటిని తాగదు. కనీసం సేకరించిన వర్షపు నీటిని కూడా తాగదు. ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో ఈ చాతక పక్షి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పక్షి వర్షాకాలంలో పడే మొదటి చినుకుని తాగుతుంది. ఈ చకోర పక్షి ఉత్తర,  మధ్య భారతదేశంలో ఉన్నట్లు తెలుస్తోంది.

వర్షపు నీరు అదీ తొలకరి చినుకు పడే సమయంలో పడే నీటిని ఈ పక్షి నీరు తాగుతుంది. అప్పటి వరకూ నీరు లేకుండా రోజుల తరబడి జీవించగలదు. ఈ పక్షికి దాహం వేసినప్పుడు వర్షం కురిపించమంటూ వరుణుడిని ప్రార్ధిస్తుందని భారతీయుల నమ్మకం.

ఇవి కూడా చదవండి

ఈ పక్షికి పొడవాటి తోక, నలుపు , తెలుపు ఈకలతో తలపై చిహ్నాన్ని కలిగి ఉంటుంది. చాలా పొడవాటి తోకతో, పక్షి పరిమాణం దాదాపు మైనాలా కనిపిస్తుంది. పక్షి శాస్త్రీయ నామం క్లామేటర్ జాకోబిన్స్. భారతదేశంలో రెండు పక్షులు కనిపించినట్లు తెలుస్తోంది. ఒకటి దేశంలోని దక్షిణ భాగంలో నివసిస్తుంది. మరొకటి రుతుపవనాలతో పాటు అరేబియా సముద్రం దాటి ఆఫ్రికా.. ఉత్తర..మధ్య భారతదేశానికి చేరుకుంటుందని తెలుస్తోంది.

భారతదేశంలో ఈ పక్షి ప్రధానంగా ఉత్తరాఖండ్‌లో కనిపిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌లో దీనిని చోలి అని పిలుస్తారు. ఈ పక్షి ఆకాశం వైపు చూస్తూనే ఉంటుంది. ఈ పక్షిని మార్వాడీలో మఘవా, పాపియా అని కూడా పిలుస్తారు.

వీటి ఆహారంలో ప్రధానంగా కీటకాలు, గొల్లభామలు, చెదపురుగులు, నత్తలు, పండ్లు, బెర్రీలు. జూన్-ఆగస్టు కాలంలో జాకోబిన్ కోకిల జాతి పక్షులు గుళ్లను నిర్మించుకోవు. ఇతర పక్షుల గూళ్లలో గుడ్లను పెడతాయి. ఈ పక్షులు ఈ గుడ్లను పొదిగి.. పిల్లలను పెంచుతాయి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..