Tenth Exams: పరీక్ష రాసే పది పరీక్షలు గట్టెక్కుతా..వృద్ధుడి కఠోర నిర్ణయం.. ఎందుకో తెలుసా?
Tenth Exams: కరోనా విద్యార్ధుల తలరాతలు మార్చేసింది. కష్టపడి చదివే విద్యార్థులు.. తెలివైన విద్యార్థులు.. ఇలాంటి లెక్కల్ని చెరిపేసింది. దాదాపుగా చదువులన్నీ అటకెక్కేశాయి.
Tenth Exams: కరోనా విద్యార్ధుల తలరాతలు మార్చేసింది. కష్టపడి చదివే విద్యార్థులు.. తెలివైన విద్యార్థులు.. ఇలాంటి లెక్కల్ని చెరిపేసింది. దాదాపుగా చదువులన్నీ అటకెక్కేశాయి. ఈ సంవత్సరం అన్ని పరీక్షలు రద్దు చేసి ఎదో విధానంలో విద్యార్థులను తరువాతి తరగుతల్కు ప్రమోట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కొంతమంది విద్యార్థులకు సరదాగానే ఉంది. కొందరికి మాత్రం చాల బాధను రేకెత్తించింది. దానిలోని కారణాలు ఇప్పుడు చర్చ కాదు. కానీ, ఓ వృద్ధ విద్యార్ధి గురించిన ఒక విషయం తెలుసుకోవడం ఈ కథనం.
అనగనగా కథలాంటిదే ఇది కూడా. ఆయన పేరు శివచరణ్. రాష్ట్రం రాజస్థాన్.. గ్రామం బెహరోడ్. ఈయన వయసు జస్ట్ 86 ఏళ్లు. ఏమిటీ.. ఇంతవయసు వచ్చినా ఈయనను విద్యార్ధి అని పరిచయం చేస్తున్నారు అనుకుంటున్నారా? అందుకేగా వృద్ధ విద్యార్ధి అన్నది. ఈయన 56 ఏళ్లుగా విద్యార్ధిగానే ఉన్నారు. ఎందుకంటే అన్నేళ్లుగా ప్రతీ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఫెయిల్ అవుతున్నారు. పట్టువదలని విక్రమార్కుడు కూడా ఈయన ముందు దిగదుడుపే అనిపిస్తోంది కదూ. ఉండండి. ఇంకా ఉంది స్టోరీ.. ఇప్పుడు ఈయనకు వయసు రీత్యా వచ్చిన శారీరక లోపాలు ఎన్నో ఉన్నాయి. చెవులు వినిపించడం లేదు. మాటలు తడబడుతున్నాయి. అయినా సరే పదోతరగతి పాస్ కావాలన్న ధ్యేయం మాత్రం మారలేదు.
ఎప్పుడో 1960 సంవత్సరంలో మొదటిసారి ఈయన రెగ్యులర్ విద్యార్ధిగా పదోతరగతి పరీక్ష రాశాడీయన. దానిలో పాపం ఫయిల్ అయ్యాడు. అప్పటి నుంచి పట్టుదలతో పరీక్ష పాసవ్వాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, ఫలితం దొరకడం లేదు. ఇంకోవిషయం ఏమిటంటే.. ఈయన పదో తరగతి పరిక్షలు పాస్ అయితేనే కానీ, పెళ్లి చేసుకోనని శాపధమూ చేశారు. అందుకే పాపం..ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు. గత కొద్ది కాలంగా ఈ వృద్ధుడు స్థానికంగా ఉన్న దేవాలయంలో ఉంటున్నాడు. శివ్ చరణ్ పట్టుదల చూసిన గ్రామస్తులు ఆయన చదువుకోవడానికి ఒక గదిని ఇచ్చారు. అక్కడే ఆయన ఈసారి పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈయన పదో తరగతి పరీక్షల పట్టుదలకు కరోనా మంచి మార్గం చూపించింది. ఈ సంవత్సరం పరీక్షలు రాకుండానే ఆయన పాస్ అయినట్టు చెప్పారు. దీంతో ఈయన కథకు శుభం కార్డు పడిపోవాలి. కానీ..ఇక్కడే కొత్త ట్విస్ట్ ఇచ్చారు ఈ వృద్ధ విద్యార్థి శివ్ చరణ్.
నేనొప్పుకోను.. పరీక్షలు రాయకుండా పాస్ కావడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు శివ్ చరణ్. ప్రభుత్వం తనకు జారీ చేసిన సర్టిఫికెట్ ను శివచరణ్ నిరాకరించారు. పరీక్షలు రాసి పాస్ అయితేనే తనకు విలువ అని ఈయన చెబుతున్నారు. కాపీ కొట్టి పాసవడం తనకు ఇష్టం లేదంటున్న శివచరణ్ తాను ఎప్పటికైనా కచ్చితంగా పరీక్షలు రాసి పాస్ అయ్యి తన కలను నేరవేర్చుకుంటాను అంటున్నారు. అదండీ విషయం. ఎన్నేళ్ళయినా తన స్వప్నం నెరవేరడానికి అడ్డదారులు వద్దు అంటున్న శివ్ చరణ్ ఇప్పటి విద్యార్ధులకు తప్పనిసరిగా ఆదర్శమే అని చెప్పొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఆయన తపన.. లక్ష్యం కోసం ఎంచుకున్న నిజాయతీ మార్గం నేటి విద్యార్థులకు మార్గదర్శకం అని అందరూ అంటున్నారు. మరి మీరేమంటారు?
Also Read: Garlic Good Antidote : పంటి నొప్పికి వెల్లుల్లి మంచి విరుగుడు..! ఇలా చేస్తే క్షణాల్లో మాయం..