AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Research: అలాంటి వ్యక్తి మీకు తోడుగా ఉంటే మీ మెదడు ఆరోగ్యం భేష్‌ అంటా.! ఈ విషయాన్ని చెబుతోంది మరెవరో కాదు..

Research: 'మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్లు.. మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్లు నలుగురు లేకపోతే, ఎంత సంపాదించినా.. ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముండదు' ఇది త్రివిక్రమ్‌ సినిమాలో..

Research: అలాంటి వ్యక్తి మీకు తోడుగా ఉంటే మీ మెదడు ఆరోగ్యం భేష్‌ అంటా.! ఈ విషయాన్ని చెబుతోంది మరెవరో కాదు..
Narender Vaitla
|

Updated on: Sep 16, 2021 | 5:06 PM

Share

Research: ‘మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్లు.. మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్లు నలుగురు లేకపోతే, ఎంత సంపాదించినా.. ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముండదు’ ఇది త్రివిక్రమ్‌ సినిమాలో హీరో చెప్పే డైలాగ్‌. సరిగ్గా ఆలోచిస్తే ఇది అక్షరాల నిజమనిపిస్తుంది. మన సంతోషం, బాధ నలుగురితో పంచుకోకపోతే అసలు లైఫ్‌లో ఏముంటుంది చెప్పండి. చిన్ననాటి నుంచి మన మాటలు ఓపికతో వినే స్నేహితుడు మనకు ఒక్కరైనా ఉంటారు. సహజంగా మనం అలాంటి వారితోనే స్నేహం చేయడానికి ఇష్టపడుతుంటాం. మన బాధలను, సంతోషాలను చెబుతున్నప్పుడు పెడ చెవిన పెడితే ఎక్కడలేని కోపం వస్తుంది. అదే మన మాటలకు గౌరవం ఇస్తే మాత్రం సంతోషంగా ఉంటాం.. పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

మనసులో ఉన్న భావాలను పంచుకునే వారు దొరికితే మెదడు ఆరోగ్యం బాగుటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇంటర్నేషనల్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన నివేదికలో ఈ ఆసక్తికర విషయాలను పరిశోధకులు వెల్లడించారు. సంతోషం ఏదైనా ఇతరులతో పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుందని, అలాగే బాధను చెప్పుకుంటే సగానికి తగ్గుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే మీ చుట్టూ ఉన్న వారు ఏదైనా విషయాన్ని మీతో పంచుకుంటే శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

ఈ విషయమై ఎన్‌శైయూ గ్రాస్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లోని న్యూరాలజీ ప్రొఫెసర్‌ జోయల్‌ శాలినాస్‌ మాట్లాడుతూ.. మనసులోని భావాలను చెబుతుంటే శ్రద్ధగా వినే వారుంటే వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్‌కు కూడా చెక్‌ పెట్టవచ్చని చెప్పుకొచ్చారు. అర్థమైందిగా మీ చుట్టూ ఉన్న వారి మానసిక ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందన్నమాట.

Also Read: Sai Dharam Tej: అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన బన్నీ..

Bullettu Bandi Song: గుంటూరులో ‘బుల్లెట్‌ బండి’ సందడి.. పారిశుద్ధ్య కార్మికుల డ్యాన్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

మానవ మృగాల బలవన్మరణాలు.. 2012 నుంచి ఇప్పటి వరకు 20 మంది రేపిస్టుల ఆత్మహత్యలు..