మానవ మృగాల బలవన్మరణాలు.. 2012 నుంచి ఇప్పటి వరకు 20 మంది రేపిస్టుల ఆత్మహత్యలు..
దేశంలో రేపిస్టుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. సైదాబాద్ చిన్నారిని చిదిమేసిన మానవ మృగం రాజు రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దేశంలో రేపిస్టుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన మానవ మృగం రాజు రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెప్టెంబరు 9న ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత హతమార్చిన నిందితుడు..నాటి నుంచే పరారీలో ఉన్నాడు. ఈ ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచనం సృష్టించింది. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో అతను గురువారం ఉదయం స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో రైలు పట్టాలపై శవమై తేలాడు. కాగా రేపిస్ట్‌లు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. 2012 నుంచి ఇప్పటి వరకు మొత్తం 20 మంది రేప్ కేసు నిందితులు సూసైడ్ చేసుకున్నారు.
ఆత్మహత్యకు పాల్పడిన రేపిస్టుల వివరాలు..
2012 డిసెంబర్ 1న.. రేప్ కేసులో నిందితులైన హర్యానాలోని రోహతక్ జిల్లాలోని ఆజయాబ్ గ్రామవాసులు సందీప్(24), సునీల్ (25) రైలు కింద పడి ఆత్మహత్య
2013 జూన్ 15న.. యూపీ ఘజియాబాద్ లో రేప్ కేసులో నిందితుడు 23 ఏళ్ల దుకాణం యజమాని అబిద్ ఉరివేసుకుని ఆత్మహత్య
2013, మార్చి11 నిర్భయ’ గ్యాంగ్ రేప్ ప్రధాన నిందితుడు బస్సు డ్రైవరైన రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య
2013 డిసెంబర్ 18న.. రేప్ కేసులో నిందితుడు ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో నివసించే ఓ ఎన్జీవో డైరెక్టర్ ఖుర్షీద్ అన్వర్ ఆత్మహత్య, అపార్ట్ మెంట్ నుంచి దూకి బలవన్మరణం
2014 మార్చి 13న.. ఢిల్లీలోని గోవింద్ పురిలో కన్న కూతురిని రేప్ చేసిన కేసులో నిందితుడు 58 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య
2014 జూన్ 21న.. రాజస్థాన్ లో రేప్ కేసులో జైల్లో ఉన్న నిందితుడు మాజీ రైల్వే కానిస్టేబుల్ సునీల్ కుమార్(40ఏళ్లు) ఆత్మహత్య
2015, ఫిబ్రవరి 9న… హర్యానా లోని రోహతక్ లో మహిళ గ్యాంగ్ రేప్ లో నిందితుల్లో ఒకడు(28ఏళ్లు) ఆత్మహత్య
2017 ఆగస్ట్ 3న. జమ్ము, కశ్మీర్ లోని రాజోలీ జిల్లాలో బాలికను రేప్ కేసులో నిందితుడిని బాలిక మూత్రం తాగాలని తీర్పిచ్చిన పంచాయితీ పెద్దలు. దర్యాప్తు కొన సాగుతున్న సమయంలో నిందితుడు ఫాజల్ హుస్సేన్ ఆత్మహత్య
2018, ఫిబ్రవరి28, 30 రేప్ లు, 13 మర్డర్లు చేసిన సైకో శంకర్ జైలులో బ్లేడ్ తో గొంతుకోసుకుని ఆత్మహత్య
మే4, 2018 గుంటూరు జిల్లా దాచేపల్లి అత్యాచార నిందితుడు రామసుబ్బయ్య ఆత్మహత్య గురజాల మండలం దైద అమరలింగేశ్వరస్వామి ఆలయంలో ఓ చెట్టుకు ఉరి
2018 ఆగస్ట్ 20న.. రాజస్థాన్ లో తన తండ్రే(40ఏళ్లు) తనను రేప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు. ఎఫ్ఐఆర్ నమోదు అనంతరం నిందితుడు ఉరివేసుకొని ఆత్మహత్య
2019, జనవరి 23న.. మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడాలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారి స్మార్టానా పాటిల్ వెల్లడి
2019 సెప్టెంబర్ 1న.. మధ్య ప్రదేశ్ లోని చత్తార్ పూర్ జిల్లాలో బాలిక కిడ్నాప్, రేప్ ఘటనలో 24 ఏళ్ల నిందితుడు వీరేంద్ర లోదీ బాత్ రూమ్ లో టవల్ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల ప్రకటన
2020 నవంబర్ ..రేప్ కేసు నిందితుడు రోడ్డు ప్రమాదంలో మృతి..యూపీ కాన్పూర్ సమీపంలోని డిబియాపురాలో ఘటన
ఏప్రిల్8, 2021 లైంగిక దాడి కేసులో నిందితుడు వర్మా అజయ్‌కుమార్(28) ఆత్మహత్య పిన్ని కూతురిపై లైంగిక దాడి. భద్రాది జిల్లా రామవరంలోని తన ఇంట్లో ఉరి
డిసెంబర్30, 2020 అత్యాచారం కేసు నిందితుడి ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో ఘటన వివాహితపై అత్యాచారానికి పాల్పడినట్లు యువకుడిపై కేసు. చెట్టుకు ఉరి వేసుకున్న నిందితుడు
జులై29, 2021 అత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ ఆత్మహత్య. ఉత్తరప్రదేశ్ లోని మౌదహ కొత్వాలీ పోలీసుస్టేషన్ లాకప్ లో ఆత్మహత్య మైనర్ బాలికపై అత్యాచారం కేసు, లాకప్ లో లుంగీతో ఉరి
జనవరి6, 2021 కేరళ పాలక్కాడ్ జిల్లా వాలయార్‌లో మైనర్ బాలికలపై అత్యాచారం నలుగురు నిందితుల్లో ఒకరైన ప్రదీప్ కుమార్ ఆత్మహత్య
2021,మార్చి 12న.. యూపీలో చిత్రకూట్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు జైల్లో ఉన్న 50 ఏళ్ల వ్యక్తి సంతోష్ శుక్లా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్పీ వెల్లడి
2021, సెప్టెంబర్16..సింగరేణి చైత్ర రేప్ కేసు నిందితుడు రాజు స్టేషన్ ఘనపూర్ లో రైల్వే ట్రాక్ కింద పడి ఆత్మహత్య.
Also Read..
సైదాబాద్ చిట్టి తల్లి కిడ్నాప్ నుంచి రాజు ఆత్మహత్య వరకు…వారం రోజులు ఏంజరిగింది?