AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Arthritis Day 2022: ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ డ్రింక్స్‌తో చెక్ పెట్టండి..

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబ నేపథ్యం, వృద్ధాప్యం, ఊబకాయం, మునుపటి గాయం

World Arthritis Day 2022: ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ డ్రింక్స్‌తో చెక్ పెట్టండి..
Arthritis
Shiva Prajapati
|

Updated on: Oct 12, 2022 | 1:59 PM

Share

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబ నేపథ్యం, వృద్ధాప్యం, ఊబకాయం, మునుపటి గాయం వంటి అనేక కారణాల వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అది ఆర్థరైటిస్‌గా మారి తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. ఆర్థరైటిస్‌కు చికిత్స లేనప్పటికీ, శారీరకంగా చురుకుగా ఉండటం, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు.. ఆరోగ్యకరమైన శరీర బరువు ఉండేలా సహకరిస్తుంది.

ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడే డ్రింక్స్ ఇవే..

ఆవుపాలు..

ఆవు పాలలో నాణ్యమైన ప్రోటీన్స్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇది మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకల అభివృద్ధికి, కండరాల పనితీరు మెరుగుపరచడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంతో సహాయపడుతుంది. ఆవు పాలలో విటమిన్ ఎ, జింక్, థయామిన్, అయోడిన్, విటమిన్ బి12, పొటాషియంతో పాటు కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన పోషకాలు ఉంటాయి.

మంచినీరు..

నీరు ఆరోగ్య సమస్యలను పరిష్కరించే అద్భుతం. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు రోజంతా సరిపడా నీళ్లు తాగడం తప్పనిసరి. శరీరం హైడ్రేట్ అయినప్పుడు.. టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, నీరు వాపును తగ్గిస్తుంది. కీళ్లను లూబ్రికేట్ చేస్తుంది. ప్రతి రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హెర్బల్ టీ..

హెర్బల్ టీ తాగడం వల్ల ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చునని నిపునులు చెబుతున్నారు. హెర్బల్ టీ లో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది కీళ్లు, కండరాల నొప్పిని నివారించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ, అల్లం టీ అయినా సరే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

స్మూతీ..

ఫ్రూజ్ స్మూతీ, వెజిటబుల్ స్మూతిలో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల తిమ్మిరి, నొప్పులు, మంటలను తగ్గిస్తాయి. ఒమెగా 3 కలిగిన ఉన్న గింజలను ఇందులో కలిపి తీసుకోవడం వల్ల ఎముక, మృదులాస్థి ఆరోగ్యాన్ని పెంచుతుంది. తుంటి, మోకాళ్లను స్థిరీకరిస్తుంది.

తాజా కూరగాయలు, పండ్ల రసం..

ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణాలలో ఒకటి మంట. తాజా పండ్లు, కూరగాయల రసాలను తాగడం వలన ఈ సమస్యను నివారించొచ్చు. పైనాపిల్, నారింజ వంటి పండ్లు, క్యారెట్, టొమాటోలు వంటి కూరగాయలు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి వాపు కు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఈ జ్యూస్‌లను తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను నివారించడంలో సహాయపడుతుంది. జ్యూస్‌లను క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే, జ్యూస్‌లలో చక్కెర, క్యాలరీలు ఉంటాయి కాబట్టి వాటిని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..