Women Health: గర్బధారణ సమయంలో స్త్రీలు దోసకాయ తినొచ్చా? వైద్యులు చెబుతున్న కీలక విషయాలివే..

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉంటాయి. వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతుంటారు. అందుకే శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు, కూలింగ్ కోసం నీటిశాతం ఎక్కువగా ఉండే..

Women Health: గర్బధారణ సమయంలో స్త్రీలు దోసకాయ తినొచ్చా? వైద్యులు చెబుతున్న కీలక విషయాలివే..
Women Health
Follow us

|

Updated on: Mar 18, 2023 | 3:16 PM

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉంటాయి. వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతుంటారు. అందుకే శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు, కూలింగ్ కోసం నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులను తీసుకుంటారు. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతాయి. ముఖ్యంగా వేసవిలో గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలని వైద్య నిపుణులు సలహా ఇస్తుంటారు. వేసవిలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఏం తినాలి? ఏ పరిమాణంలో తినాలి? అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అయితే, వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచి, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి దోహదపడే దోసకాయను గర్భిణీ స్త్రీలు తినొచ్చా? తింటే ఎలా తినాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దోసకాయను సూక్ష్మపోషకాల గని అంటారు. ఇందులో విటమిన్ సి, కె, బి, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. గర్భధారణ సమయంలో పిల్లల పెరుగుదలకు ఈ పోషకాలన్నీ అవసరం. దోసకాయలలో ఉండే విటమిన్లు B, B6, B9 వంటివి ఆందోళన, ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. తరచుగా మానసిక కల్లోలం, ఆందోళనను అనుభవించే గర్భిణీ స్త్రీలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

రక్తపోటును స్థిరంగా ఉంచుతుంది..

దోసకాయలో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇది గర్భధారణ సమయంలో స్త్రీలలో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే హార్మోన్ల మార్పుల కారణంగా.. రక్తపోటులో హెచ్చుతగ్గులను ఎదుర్కొంటారు. దోసకాయ శరీరంలో సోడియం స్థాయిలను తగ్గించడంలో, ద్రవ సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది. ఇది గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహించడం తల్లి, బిడ్డ ఇద్దరికీ ముఖ్యం.

ఇవి కూడా చదవండి

దోసకాయ తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..

దోసకాయలు తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. దోసకాయ తినడం వల్ల అలర్జీ, అజీర్తి, త్రేన్పులు, తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ.. గర్భధారణ సమయంలో స్త్రీలు తినవచ్చు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం వైద్య నిపుణులు అందించిన సమాచారం, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఈ విషయంలో వైద్యులను సంప్రదించిన తరువాత, వారి సూచనల మేరకు ఆహారం, డైటింగ్ పాటించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు