Cold Problem : మీ పిల్లలను తరచూ జలుబు వేధిస్తుందా..? అయితే నో టెన్షన్ వారికి ఆ శక్తి పెరుగుతన్నట్లే..!

కోవిడ్-19 మహమ్మారి సమయంలో, కోవిడ్ సోకిన పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు పెద్దవారి కంటే తక్కువ అనారోగ్యంతో బాధపడుతున్నారని పరిశోధకులు గమనించారు. ఈ విషయాన్ని అధ్యయనం స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు పిల్లల నుంచి సేకరించిన రక్త నమూనాలపై అధ్యయనం చేశారు.

Cold Problem : మీ పిల్లలను తరచూ జలుబు వేధిస్తుందా..? అయితే నో టెన్షన్ వారికి ఆ శక్తి పెరుగుతన్నట్లే..!
Cold
Follow us

|

Updated on: Mar 18, 2023 | 3:45 PM

2020 నుంచి కరోనా అందరినీ ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టిందో అందరీకీ తెలిసిందే. దశల వారీగా దాని ప్రభావానికి గురైన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి సమయంలో ముఖ్యంగా ఈ మహమ్మారి పిల్లలకు సోకితే ఎలా? అని అందరూ బయపడ్డారు. అయితే ఆ సమయంలో పిల్లలకు మహమ్మారి సోకినా ఇబ్బంది లేదని వైద్యుల వెల్లడించడంతో ఊపిరి పీల్చుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో, కోవిడ్ సోకిన పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు పెద్దవారి కంటే తక్కువ అనారోగ్యంతో బాధపడుతున్నారని పరిశోధకులు గమనించారు. ఈ విషయాన్ని అధ్యయనం స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు పిల్లల నుంచి సేకరించిన రక్త నమూనాలపై అధ్యయనం చేశారు. కోవిడ్‌కు కారణమయ్యే వైరస్ అయిన సార్స్ సీఓవీ2 సోకిన కణాలకు ప్రతిస్పందించే మెమరీ T కణాలను వారు గుర్తించారు. కాలానుగుణ సాధారణ జలుబు లక్షణాలకు కారణమయ్యే నాలుగు కరోనావైరస్లలో ఒకదాని వల్ల వారికి ఇప్పటికే జలుబు ఉందని పరిశోధకులు తెలిపారు. దీంతో పిల్లలు తరచూ జలుబుతో బాధపడుతున్నారని ఆందోళన వద్దని వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని గుర్తించాలని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఈ పరిశోధనలో ముఖ్యంగా టీ- సెల్ ప్రతిస్పందన ఎలా అభివృద్ధి చెందుతుందో? అలాగే అది కాలక్రమేణా ఎలా మారుతుందో? చూపిస్తుంది. టీకాల భవిష్యత్తు పర్యవేక్షణ మరియు అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తుందో? తెలుస్తుంది. చిన్నారుల్లో కరోనావైరస్‌లకు మెమరీ టీ-సెల్ ప్రతిస్పందన రెండేళ్ల వయస్సులోనే అభివృద్ధి చెందుతుందని ఫలితాలు సూచిస్తున్నాయి. రెండు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల నుంచి 48 రక్త నమూనాలు, 26 -83 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పెద్దల నుంచి సేకరించిన 94 నమూనాల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ విశ్లేషణలో ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న 58 మంది వ్యక్తుల రక్త నమూనాలు కూడా ఉండడం గమనార్హం. భవిష్యత్‌లో చిన్న, యుక్త వయస్సున్న పిల్లలతో పాటు యువతపై సారూప్య అధ్యయనాలు చేయాలనుకుంటున్నామని పరిశోధకులు వెల్లడిస్తుననారు. చిన్న వయస్సు నుంచి యుక్తవయస్సు వరకు కరోనావైరస్లకు రోగనిరోధక ప్రతిస్పందన ఎలా అభివృద్ధి చెందుతుందో?  మెరుగ్గా ట్రాక్ చేయాలనుకుంటున్నామని పరిశోధకులు పేర్కొంటున్నారు. 

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, వైద్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..