Winter Season: శీతాకాలంలో ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా ఈ సింపుల్ వ్యాయామ టిప్స్ పాటించండి..
Winter Season: శీతాకాలంలో ఉదయమే మేల్కోవడం అంటే ఎవరికైనా బద్దకమే.. ఆమ్మో చలి అంటూ.. మరికొంచెం సేపు నిద్రపోవాలని అనుకుంటారు. ఇక వ్యాయమ విషయానికి..
Winter Season: శీతాకాలంలో ఉదయమే మేల్కోవడం అంటే ఎవరికైనా బద్దకమే.. ఆమ్మో చలి అంటూ.. మరికొంచెం సేపు నిద్రపోవాలని అనుకుంటారు. ఇక వ్యాయమ విషయానికి వస్తే.. బరువు తగ్గాలని, ఫిట్ గా ఉండాలనుకునేవారికి శీతాకాలంలో చేసే వ్యాయామం మంచి ఉపయోగకారి. ఎందుకంటే శీతాకాలంలో వ్యాయామం చేయడం వల్ల మీరు వేసవిలో చేసే వ్యాయామం కంటే ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. చలికాలంలో చెమట తక్కువగా పడుతుంది. దీంతో మీ వ్యాయామం మరింత చురుకుగా చేసే అవకాశం ఉంది. ఈరోజు శీతాకాలంలో కూడా మీరు వ్యాయామం చేయడానికి .. మీ ఫిట్‌నెస్ ను కొనసాగించడానికి ఏమి చేయాలో ఇపుడు తెలుసుకుందాం..
నడక/ రన్నింగ్/ జాగింగ్: శీతాకాలంలో మనసు ప్రశాంతంగా .. శరీరం చురుకుగా ఉండాలనే దినచర్యను చురుకైన నడకతో ప్రారంభించండి లేదా మీరు జాగింగ్ చేయవచ్చు లేదా మీ పరిసరాల్లో పరుగెత్తవచ్చు. ఇలా ఉదయమే చేసే వ్యాయామం హృదయ స్పందన రేటును పెంచుతాయి. అంతేకాదు.. నెక్స్ట్ వ్యాయమ సెషన్‌కు మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని సిద్ధం చేస్తాయి.
శరీరాన్ని సాగదీయడం: మీరు జాగింగ్ లేదా రన్నింగ్ చేసిన అనంతరం కొన్ని నిముషాలు శరీరాన్ని స్ట్రెచింగ్ కోసం కేటాయించండి. ఇలా చేయడం వలన మీ కండరాలు గాయాల బారిన పడకుండా సురక్షితంగా ఉంచుతుంది. అంతేకాదు శరీరం సన్నగా ఉండేలా చేస్తుంది.
సూర్య నమస్కారం: యోగాలో, సూర్య నమస్కారం అని కూడా పిలువబడే ఒక ఆసనం.. పూర్తి శరీర వ్యాయామంగా పరిగణించబడుతుంది. సూర్య నమస్కారం ఎనిమిది వేర్వేరు భంగిమలను కలిగి ఉంటుంది. ఉదయాన్నే సూర్యాసనం ప్రాక్టీస్ చేయడం వల్ల మీ శరీరంలో విటమిన్ డి పెరుగుతుంది. అంతేకాదు అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది సూర్యనమస్కారం.
ప్రాణాయామం: ప్రాణాయామం అనేది శ్వాస కు చెందిన వ్యాయామం. ఇది మనస్సు, శరీరం రెండింటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. శీతాకాలంలో కపాల్‌భతి ప్రాణాయామం, ఖండ ప్రాణాయామం వంటి పద్ధతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి.
ధ్యాన పద్ధతులు: స్థితి ధ్యాన, శ్వాస ధ్యాన, ఆరంభ ధ్యాన మొదలైన అనేక మెడిటేషన్ టెక్నిక్‌లను మీరు క్రమం తప్పకుండా అభ్యసించవచ్చు. ఇలా ధ్యానంపై దృష్టి పెడితే.. మీలోని సానుకూల దృక్పథం -పెరుగుతుంది. అంతేకాదు సులభమైన మరియు శక్తివంతమైన మెడిటేషన్ టెక్నిక్ ఇది.
ఇలా శీతాకాలంలో వ్యాయాయం, యోగ , ధ్యానం వంటి చిన్న చిన్న మార్గాలతో చలికాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉంటూ శీతకాలాన్ని ఎంజాయ్ చేయవచ్చు.
Also Read: సమాజంపై విరక్తితో అడవి బాట పట్టిన వ్యక్తి.. 40 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న వైనం ఎక్కడంటే..