Deva Kanchanam: గజ్జి, దురద, తామరతో ఇబ్బంది పడుతున్నారా.. అందంకోసం పెంచుకునే ఈ మొక్క ఆకు దివ్య ఔషధం..
Bauhinia Medicinal Benefits: మన జీవనాధారం వంటి సహజ వనరుల పట్ల మనకున్న భక్తిని తెలియజేస్తూ భారతదేశంలో ముఖ్యంగా హిందువులు మొక్కలను, మూలికలను..
Bauhinia Medicinal Benefits: మన జీవనాధారం వంటి సహజ వనరుల పట్ల మనకున్న భక్తిని తెలియజేస్తూ భారతదేశంలో ముఖ్యంగా హిందువులు మొక్కలను, మూలికలను దేవుడిగా పూజిస్తారు. చెట్లు మనకు నీడ, పండ్లు, కూరగాయలు, నూనెలు, కలప వంటి మన మనుగడకు చాలా ముఖ్యమైన అనేక వస్తువులను అందిస్తాయి. ఈరోజు 12 ఔషధ ప్రయోజనాలున్న దేవకాంచన మొక్క. ఆయుర్వేద చికిత్సలలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్న మూలికల మొక్క. ఇది భారతదేశం అంతటా పెరుగుతుంది. ఈ చెట్టు పెరగడానికి పెద్దగా సంరక్షణ అవసరం లేదు.. అందుకనే దేవకాంచన చెట్టు పార్కులు, వీధులు, పెరడు ఇలా ఎక్కడైనా పెరుగుతుంది. అందుకనే అందమైన పువ్వులు పూసే ఈ మొక్కను అలంకార మొక్కగా పెంచుకుంటారు. శివుడి ఈ పువ్వులతో పూజని చేస్తారు. ఈరోజు ఈ మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
దేవకాంచన మొక్క: ఈ మొక్క పువ్వులు ఆర్కిడ్‌లను పోలి ఉంటాయి. తెలుపు, ఊదా, గులాబీ, లావెండర్, ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో దేవకాంచన పువ్వులు కనిపిస్తాయి. వీటిల్లో కొన్ని అరుదుగా ఉంటాయి. అయితే చాలా రంగులను మనం రెగ్యులర్ గా చూస్తూండేవే.. ఈ చెట్ల ఆకులు రెండు ఆకులు కలిసినట్లుగా గుండె ఆకారంలో ఉంటాయి. ఈ మొక్క పువ్వులు, ఆకులు, చెట్ల బెరడు అన్నీ ఔషధ గుణాలున్నవే.. డయేరియా, చర్మ వ్యాధులు, మధుమేహం, కణితులు, హేమోరాయిడ్స్, వంటిది అనేక వ్యాధులకు చికిత్సగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
పువ్వులతో ఉపయోగాలు:
మొలలు నివారణకు: ఈ చెట్టు పువ్వులను సేకరించి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పూల పొడికి సమాన మోతాదులో పటిక బెల్లం కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ పొడిని అరచెంచా మోతాదులో రోజుకు రెండుసార్లు తీసుకుంటే మొలలు తగ్గుతాయి.
హార్మోన్ల సమతుల్యం కోసం: హార్మోన్లు సరిగాలేని వారు ఈ చెట్టు బెరడుని తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. గ్లాసు నీరు సగం అయిన తర్వాత ఈ నీటిలో పటిక బెల్లం వేసుకుని ఆ నీటిని తాగిగే హార్మోన్లు సమతుల్యం అవుతాయి.
నోటి పూత నివారణకు: ఈ చెట్టు బెరడు పొడిని గ్లాసు నీటిలో వేసి.. బాగా మరిగించి.. తర్వాత ఆ నీటిని వడబోసుకుని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే.. వెంటనే నోటిపూత తగ్గుతుంది. అంతేకాదు నోటి దుర్వాసన నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
మూత్రం సంబంధిత నివారణకు: మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్, మూత్ర సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడేవారు దేవకాంచన చెట్టు బెరడుని కొన్ని ధనియాలను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి.. సగం నీరు మిగిలే వరకూ మరగించాలి. ఈ నీరు చల్లారిన తర్వాత అందులో పటిక బెల్లంను కలుపుకుని తాగితే వెంటనే నివారణ కలుగుతుంది.
కాలేయం: బెరడు కషాయం 10-20 గ్రాములు రోజుకు రెండుసార్లు తాగితే కాలేయం వాపును నయం చేస్తుంది.
ఆకులతో ఉపయోగాలు:
ఈ ఆకుల కషాయం తలనొప్పిని తగ్గిస్తుంది. ఈ ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి ఈ రసాయనాన్ని పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి.
ఈ ఆకు మిశ్రమాన్ని రాస్తే గజ్జి, దురద, తామర తగ్గుతాయి.
Also Read: ఏళ్లు నిండినవారికి గుడ్‌న్యూస్.. ఓటు నమోదు చేసుకునేందుకు ఈసీ అవకాశం.. తప్పుల సవరణకు సైతం..