AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soya Chunks Side Effects: బలం కోసం మీల్ మేకర్‌లను అదేపనిగా తినేస్తున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్టే…

మీ రొటీన్ డైట్‌లో సోయా చంక్స్ ని చేర్చుకోవడం ద్వారా మీ శరీర అవసరాలను కొంత మేరకు తీర్చుకోవచ్చు. ఇందులో చాలా ప్రొటీన్లు లభిస్తాయి. హెల్త్‌లైన్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, సోయా చంక్స్ ప్రోటీన్ నిధి మాత్రమే కాదు..

Soya Chunks Side Effects: బలం కోసం మీల్ మేకర్‌లను అదేపనిగా తినేస్తున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్టే...
soya chunksImage Credit source: TV9 Telugu
Madhavi
|

Updated on: Apr 03, 2023 | 12:35 PM

Share

మీ రొటీన్ డైట్‌లో సోయా చంక్స్ ని చేర్చుకోవడం ద్వారా మీ శరీర అవసరాలను కొంత మేరకు తీర్చుకోవచ్చు. ఇందులో చాలా ప్రొటీన్లు లభిస్తాయి. హెల్త్‌లైన్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, సోయా చంక్స్ ప్రోటీన్ నిధి మాత్రమే కాదు.. ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. మీరు దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చవచ్చు, కానీ ఏదైనా అధికంగా ఉంటే హానికరం అని గుర్తుంచుకోండి. సోయా చంక్స్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దాని అధిక వినియోగం వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ పరిమాణం పెరుగుతుంది, దీని కారణంగా స్త్రీలు పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం, రుతుచక్రంలో భంగం, ఆకలి లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి, ఆకస్మిక బరువు పెరుగటం వంటి సమస్యలు ఏర్పడే అవకాశముంది.  అందుకే మహిళలు తమ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం మంచిది.

సోయా చంక్స్ ప్రయోజనాలను తెలుసుకోండి..

  • ప్రోటీన్లు పుష్కలంగా ఉండే సోయా చంక్స్ తింటే చురుకుగా ఫిట్‌గా ఉంటారు.
  • బరువు తగ్గడం, క్యాన్సర్, శారీరక అభివృద్ధి, మధుమేహం, అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధులు రాకుండా ప్రభావవంతంగా ఉంటుంది.

అయితే సోయా చంక్స్‌ను మితంగా తీసుకుంటేనే శరీరానికి మంచిది.  మరీ ఎక్కువగా తింటే శరీరానికి కలిగే మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుందని పౌష్టికాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సోయా చంక్స్ తీసుకోవడం వల్ల నష్టాలు ఇవే..

  • మహిళలు, మధుమేహ రోగులు సోయా చంక్స్ తినకూడదు
  • పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం లేదా నొప్పి ఉన్నవారు సోయా చంక్స్ స్ తినకుండా ఉండాలి.
  • సోయా చంక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కుటుంబ నియంత్రణలో సమస్యలు, పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం వంటి మహిళల సమస్యలు పెరుగుతాయి.
  • సోయా చంక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ పరిమాణం పెరగడం వల్ల నిద్రలేమి, ఒత్తిడి, రుతుక్రమంలో ఆటంకాలు వంటి సమస్యలు ఎదురవుతాయి.
  • సోయా చంక్స్ తినడం వల్ల మహిళలు చాలా హార్మోన్ల సమస్యలను ఎదుర్కొంటారు. వాస్తవానికి, ఇందులో ఉండే సమ్మేళనం స్త్రీ హార్మోన్ ఈస్ట్రోజెన్‌ను అనుకరిస్తుంది. ఇది మహిళల్లో హార్మోన్ల ఆటంకాలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, సోయా చంక్స్ పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది.
  • మీరు మధుమేహం ఉంటే దానిని నివారించడానికి మందులు కూడా తీసుకుంటే, మీ రోజువారీ ఆహారంలో సోయా చంక్స్ లేదా దానితో చేసిన ఉత్పత్తులను చేర్చవద్దు. ఇది కాకుండా, మీ కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు మధుమేహం ఉంటే, ఇంట్లో సోయా చంక్స్ వాడటం మానేయండి.
  • సోయా చంక్స్ ఎక్కువగా తీసుకోవడం పురుషులకు కూడా హానికరం. సోయా చంక్స్ ఎక్కువగా తినడం పురుషులకు మంచిదికాదు. దీన్ని తినడం వల్ల పురుషుల్లో లైంగిక శక్తి తగ్గుతుంది. సోయా చంక్స్ తినడం పురుషుల హార్మోన్లు, లిబిడో పవర్, స్పెర్మ్ కౌంట్ సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పిల్లల కోసం ప్లానింగ్ చేస్తున్నవారు తమ ఆహారంలో ప్రతిరోజూ సోయా చంక్స్ తినకూడదు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి