AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken During Pregnancy : గర్భిణులు చికెన్ తింటే ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే షాకవుతారు

గర్భిణులు ఎట్టి పరిస్థితుల్లో చికెన్ తినరు. మటన్ తినడమే మంచిదని చాలా మంది భావిస్తారు. అయితే గర్భిణులు చికెన్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చికెన్ తినడం గర్భిణులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Chicken During Pregnancy : గర్భిణులు చికెన్ తింటే ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే షాకవుతారు
Chicken Curry
Nikhil
| Edited By: |

Updated on: Apr 03, 2023 | 9:15 AM

Share

మాతృత్వాన్ని ప్రతి మహిళ అనుభూతి చెందాలని కోరుకుంటుంది. చాలా మంది తమకు గర్భం రాలేదని బాధపడుతూ ఉంటారు. గర్భధారణ కోసం వివిధ ఆస్పత్రులకు తిరుగుతూ ఉంటారు. అయితే ప్రయత్నాలన్నీ ఫలించి గర్భందాలిస్తే పుట్టబోయే బిడ్డ కోసం మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే గర్భిణులు ఎట్టి పరిస్థితుల్లో చికెన్ తినరు. మటన్ తినడమే మంచిదని చాలా మంది భావిస్తారు. అయితే గర్భిణులు చికెన్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చికెన్ తినడం గర్భిణులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. చికెన్‌లో ఉండే పోషక విలువల బిడ్డ ఎదుగుదలకు చాలా సాయం చేస్తాయని వివరిస్తున్నారు. అయితే చికెన్ తినడం అంటే ఎలా తింటున్నాం? అనే విషయాన్నిపరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. కాబట్టి గర్భిణులు చికెన్ తినడం వల్ల కలిగే లాభాలను ఓ సారి తెలుసుకుందాం.

గర్భిణులు చికెన్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

ప్రోటీన్

చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శిశువు పెరుగుదల, అభివృద్ధికి అవసరం అవుతుంది. చికెన్‌లో ఉండే ప్రొటీన్ బేబీ సెల్స్‌తో పాటు టిష్యూస్ ఏర్పడటానికి సాయం చేస్తాయి.

ఐరన్

చికెన్‌లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఐరన్ హిమోగ్లోబిన్ ఏర్పడడంలో కీలకంగా ఉంటుంది. శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ను చేరవేసేందుకు హిమోగ్లోబిన్ బాధ్యత వహిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే రక్తహీనతను నివారించడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

విటమిన్లు, మినరల్స్

చికెన్‌లో విటమిన్ బి12, విటమిన్ ఎ, జింక్‌తో సహా అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శిశువు అవయవాలు, కంటి చూపు, రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

తక్కువ కొవ్వు పదార్థాలు

చికెన్‌ అనేది తక్కువ కొవ్వు పదార్థమైన లీన్ మాంసం. అందువల్ల గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సాయం చేస్తుంది. 

చికెన్ తినే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉడికించడం

ముఖ్యంగా కొన్ని రకాల వ్యాధులను నివారించడానికి చికెన్‌ను పూర్తిగా ఉడికించాలని నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు తక్కువగా వండని లేదా పచ్చి చికెన్ తినకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది తల్లితో బిడ్డ ఆరోగ్యానికి కూడా హానికరంగా పరిణమిస్తుందని పేర్కొంటున్నారు.

నాటుకోళ్లు ఉత్తమం

చికెన్ అంటే కేవలం బ్రాయిలర్ మాంసం తినకుండా నాటుకోడి మాంసం తింటే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే బ్రాయిలర్ కోడి ఎదగడానికి వివిధ ఇంజక్షన్లు చేస్తారని, అందువల్ల గర్భిణులు నాటుకోడి మాంసం తినడం మేలని సూచిస్తున్నారు. 

ఉప్పు

గర్భిణులు చికెన్ వండుకునే సమయంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. అంటే ఉప్పులో ఉండే సోడియం బిడ్డ ఆరోగ్యానికి హాని చేస్తుంది. అలాగే గర్భిణులకు కూడా అధిక రక్తపోటు రావడానికి కారణంగా ఉంటుంది. 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..