Lifestyle: 40 ఏళ్లు దాటిన మహిళలు తన భర్త దగ్గర కోరుకునేది ఇదేనట..!
వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురిస్తుంది. రోజురోజుకు వారిద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంటుంది. అయితే కొత్తలో ఇద్దరి దంపతుల మధ్య ప్రేమ ఒకలాగా ఉంటే.. వయసు పెరుగుతున్నకొద్ది మరోలాగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భార్యాభార్తలకు 40 ఏళ్లు..

వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురిస్తుంది. రోజురోజుకు వారిద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంటుంది. అయితే కొత్తలో ఇద్దరి దంపతుల మధ్య ప్రేమ ఒకలాగా ఉంటే.. వయసు పెరుగుతున్నకొద్ది మరోలాగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భార్యాభార్తలకు 40 ఏళ్లు దాటిన తర్వాత వారి ప్రేమ బంధాల్లో కాస్తా మార్పులుంటాయట. 40 ఏళ్లు దాటిన మహిళల్లో వారి కోరికలు వేరేగా ఉంటాయని నిపుణులు చెబుతున్నమాట. ఈ వయసులో భార్యాభర్తల మధ్య కోరికలు అవసరాలు వేగంగా మారుతాయి.
ముఖ్యంగా మహిళల్లో జీవన సంబంధమైన మార్పులు శర వేగంగా పెరుగుతాయని చెబుతున్నారు. ఈ కారణంగా 40 ఏళ్ల వయసు వచ్చే సరికి కొంత మంది మహిళల్లో బరువు పెరుగుతారు. భర్తకంటే కాస్త పెద్దవారిలా కనిపిస్తారు. అయితే చాలా మంది పురుషులు తన భర్య అందంగా కనిపించాలని కోరుకుంటారట. కానీ భార్య మాత్రం తన భర్త పరాయి స్త్రీ వంక చూడవద్దని కోరుకుంటుందట. అంతే కాదండోయ్ ఇతర స్త్రీలతో తనను పోల్చకూడదనే భావలో ఉంటుంది.
భర్త నిజాయితీగా ఉండాలని..
భర్త తన భర్త నిజాయితీగా ఉండాలని కోరుకుంటారట. అయితే నిజాయితీగా ఉండే పురుషులు స్త్రీలను ఎక్కువ మోసం చేయరు. అందుకే భర్త దగ్గర నుంచి భార్య కోరుకునేది ఇదేనని నిపుణులు పేర్కొంటున్నారు.




ఇక 40 ఏళ్ల దాటిన తర్వాత కొంత మంది భర్తలు వారి భార్యలను విస్మరిస్తారు. పెద్దగా పట్టించుకోరు. అందుకు కారణం లేకపోలేదు. బిజీ లైఫ్, ఇతరత్రా కారణాల వల్ల కావచ్చు. ఈ సమయంలో చాలామంది మహిళలు వారి భర్త ప్రేమగా చూసుకుంటూ ప్రేమగా గడపాలని కోరుకుంటారట. ఈ సమయంలో భార్యకు భర్త ఐలవ్‌ను అని చెబితే చాలు వారిపై మరింత ప్రేమ పెరుగుతుందని పలు సర్వేలు కూడా తెలిపాయి. 40 ఏళ్లు వచ్చినా.. ఇంకా సంతోషంగా గడపాలన్నది వారి కోరిక.
40 ఏళ్లు వచ్చిన దంపతులకు వారి పిల్లలు పెద్దవారి పోతారు. ఉన్నత చదువుల్లో గానీ, ఉద్యోగాల్లో ఉంటారు. ఈ సందర్భంలో వారికి కాస్తా రిలీఫ్ దొరికనట్లయవుతుంది. అప్పుడు భర్త తనతో ప్రేమగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు శృంగారంపై కూడా కోరిక పుడుతుందట. తన భర్త కనీసం తనతో ఈ విధంగా గడపాలని కోరుకుంటారట. ఎందుకంటే 40 ఏళ్లు వచ్చేసరికి పిల్లలు పెద్దవారైపోవడంతో రిలీఫ్ అవుతారు. అలాంటి సమయంలో మహిళలు భర్త వద్ద ప్రేమగా ఉండేందుకు ప్రయత్నిస్తారట.
సమయాన్ని వృధా చేయవద్దు
40 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళలు తమ జీవితంలో సమయాన్ని వృథా చేయకూడదనుకుంటారు. ఎందుకంటే పెళ్లైన నాటి నుంచి 40 ఏళ్లు వచ్చే వరకు ఎన్నో కష్టాలు, ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. పిల్లల చదువులు, వారు స్థిరపడాలన్న భావనతో ఉంటారు. తర్వాత కాస్త విశ్రాంతి దొరుకుతుండటంతో వారి మధ్య ప్రేమను మరింతగా పెంచుకునేలా ప్రయత్నిస్తారట. ఈ సమయంలో ఎక్కడైన టూర్ వెళ్లి ప్రశాంతంగా గడిపి రావాలనే కోరికలు కూడా పెరుగుతాయట.




