Kidneys Side Effects: కిడ్నీలు ఎందుకు పాడవుతాయి? కిడ్నీల ఫెయిల్యూర్స్ కు కారణాలేంటి ?

మూత్రపిండాలు (కిడ్నీలు)లో తేడా రాకుండానే ఉండాలి. ఒక్కసారి కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిందంటే.. దాని వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే.. పొత్తికడుపులో వచ్చే నొప్పి భరించలేం. అలాగే కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ చేరితే.. శరీర అవయవాల్లో మార్పు కనిపిస్తుంది. ఏ పని చేయలేనంత నొప్పులు వస్తాయి. కాళ్లు, చేతులకు నీరు చేరడం, భుజాల నొప్పులు, మెడనరాల నొప్పులు, నడుంనొప్పి, ఎక్కువసేపు నిలబడలేకపోవడం వంటి సమస్యలన్నీ..

Kidneys Side Effects: కిడ్నీలు ఎందుకు పాడవుతాయి? కిడ్నీల ఫెయిల్యూర్స్ కు కారణాలేంటి ?
Kidneys
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 27, 2023 | 12:00 PM

మూత్రపిండాలు (కిడ్నీలు)లో తేడా రాకుండానే ఉండాలి. ఒక్కసారి కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిందంటే.. దాని వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే.. పొత్తికడుపులో వచ్చే నొప్పి భరించలేం. అలాగే కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ చేరితే.. శరీర అవయవాల్లో మార్పు కనిపిస్తుంది. ఏ పని చేయలేనంత నొప్పులు వస్తాయి. కాళ్లు, చేతులకు నీరు చేరడం, భుజాల నొప్పులు, మెడనరాల నొప్పులు, నడుంనొప్పి, ఎక్కువసేపు నిలబడలేకపోవడం వంటి సమస్యలన్నీ చుట్టుముడతాయి.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. కిడ్నీల ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన శరీరంలో ఉన్న రక్తాన్ని గంటకు రెండుసార్లు కిడ్నీలు వడకడుతాయి. ఇవి రక్తంలో ఉండే మలినాలను, విషపదార్థాలను, హాని కలిగించే టాక్సిన్లను వడకట్టి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అందుకు శరీర పనితీరు బాగుండాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మూత్రపిండాల ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి.

మూత్రపిండాలు ఎందుకు పాడవుతాయి?

ఇవి కూడా చదవండి

మూత్రపిండాలు పాడవ్వడానికి మూడు కారణాలుంటాయి. వాటిలో మొదటిది షుగర్ వ్యాధి. నేటి జీవనశైలిలో.. యుక్తవయసులోనే షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. 40 శాతం మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు మూత్రపిండాల ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి. రెండవది అధిక రక్తపోటు. దీని కారణంగా కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయి. అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలకు రక్తప్రసరణ సాఫీగా జరగదు. ఫలితంగా అవి దెబ్బతింటాయి.

కొన్నిరకాల వైరస్, బ్యాక్టీరియాల కారణంగా కూడా మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. షుగర్, బీపీ సమస్యలతో బాధపడేవారు, ఎలాంటి సమస్యలు లేనివారు కూడా ఏడాదికి ఒకసారి మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. యూరిన్ ఆల్బుమిన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇఎఫ్ఆర్ వంటి టెస్టులు చేయించుకుని.. ఏదైనా సమస్య ఉన్నట్లు తెలిస్తే వైద్యుడి సలహా మేరకు మెడిసిన్ తీసుకోవాలి.

మూత్రపిండాల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటూ.. ఉప్పును తక్కువగా తినాలి. బరువు కంట్రోల్ లో ఉండాలి. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజూ కంటినిండా నిద్రపోవాలి. ఒత్తిడి, ఆందోళన దరిచేరకుండా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. రోజుకి కనీసం నాలుగు లీటర్ల నీరైనా తాగుతూ ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి