AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ustrasana Benefits: ఐదే ఐదు నిమిషాలు ఈ ఆసనం వేస్తే.. దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు!!

ప్రస్తుత కాలంలో మనలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల కంటే.. అనారోగ్యాలను పెంచే ఆహారాలనే ఎక్కువగా తింటున్నాం. మనం తినేది చాలక.. పిల్లలకు కూడా ఎక్కువగా జంక్ ఫుడ్స్ అలవాటు చేసేస్తున్నాం. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఆస్తమా, సైనస్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఇవే ప్రాణాంతకం కూడా కావొచ్చు. యోగా ఆసనాలకు ఎలాంటి వ్యాధులనైనా నయం చేసే శక్తి ఉంది. ప్రతిరోజూ వివిధ రకాల వ్యాధులను నయం చేసే యోగా..

Ustrasana Benefits: ఐదే ఐదు నిమిషాలు ఈ ఆసనం వేస్తే.. దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు!!
Ustrasana Benefits
Chinni Enni
|

Updated on: Aug 23, 2023 | 4:52 PM

Share

ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల కంటే.. అనారోగ్యాలను పెంచే ఆహారాలనే ఎక్కువగా తింటున్నాం. మనం తినేది చాలక.. పిల్లలకు కూడా ఎక్కువగా జంక్ ఫుడ్స్ అలవాటు చేసేస్తున్నాం. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఆస్తమా, సైనస్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఇవే ప్రాణాంతకం కూడా కావొచ్చు.

యోగా ఆసనాలకు ఎలాంటి వ్యాధులనైనా నయం చేసే శక్తి ఉంది. ప్రతిరోజూ వివిధ రకాల వ్యాధులను నయం చేసే యోగా ఆసనాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు థైరాయిడ్, ఆస్తమా, సైనస్ వ్యాధుల్ని తగ్గించే ఆసనం గురించి తెలుసుకుందాం. ఈ ఆసనాన్ని రోజూ వేస్తే.. ఎలాంటి శ్వాసకోశ సమస్యలైనా వెంటనే తగ్గిపోతాయి. థైరాయిడ్ గ్రంథులు కూడా బాగా పనిచేస్తాయి.

ఈ ఆసనం ఎలా వేయాలంటే:

ఇవి కూడా చదవండి

ఈ ఆసనం పేరు ఉష్ట్రాసనం. ఈ ఆసనం వేసేందుకు.. ముందుగా నేలపై మోకాళ్లమీద కూర్చోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి మోకాళ్లమీదే ఉండి నిలబడాలి. రెండు అరచేతుల్ని పిరుదులపై ఉంచి.. వాటి సపోర్ట్ తో నిదానంగా వెనక్కి వంగాలి. ఇప్పుడు ముఖాన్ని పైకెత్తి చూస్తూ.. పిరుదులపై ఉన్న చేతులను తీసేసి వాటితో రెండు పాదాలను పట్టుకోవాలి. మొదట్లో ఈ ఆసనం వేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ భంగిమలో 6-10 సెకండ్లపాటు ఉండి.. మళ్లీ యథాస్థితికి రావాలి. నిదానంగా ఈ సమయాన్ని 5 నిమిషాల వరకూ పెంచుకుంటూ వెళ్లాలి.

ఉష్ట్రాసనం ప్రయోజనాలు:

ప్రతిరోజూ ఈ ఆసనం వేస్తే ఆస్తమా, సైనస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే థైరాయిడ్ గ్రంథుల పనితీరు మెరుగుపడి.. థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. మెదడుకు ర క్తసరఫరా పెరుగుతుంది. కాళ్లు, తొడలు, చేతులు, భుజాలతో పాటు గుండె, నడుం, ఛాతీ, గర్భాశయం దృఢంగా ఉంటాయి. ఊపిరితిత్తులు శుభ్రమై వాటి పని తీరు మెరుగుపడుతుంది. గర్భం దాల్చిన వారు మాత్రం ఉష్ట్రాసనం వేయరాదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి