Cloves: కేవలం రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే చాలు.. ఆ సమస్యలన్నీ పరార్!
మనలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకు కూడా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. వంటిట్లో దొరికే వస్తువులతో చాలా మటుకు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. అలా వంటింట్లో పరిష్కారం చూపేవాటిల్లో లవంగాలు ఒకటి. వంటింటి సుగంధ ద్రవ్యాలలో లవంగాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. దంత క్షయం, పంటి నొప్పి..
మనలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకు కూడా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. వంటిట్లో దొరికే వస్తువులతో చాలా మటుకు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. అలా వంటింట్లో పరిష్కారం చూపేవాటిల్లో లవంగాలు ఒకటి. వంటింటి సుగంధ ద్రవ్యాలలో లవంగాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. దంత క్షయం, పంటి నొప్పి, జీర్ణ సమస్యలు, నోటి దుర్వాసన మొదలైన వాటికి చక్కని పరిష్కారం చూపుతాయి. లవంగాల్లో పోషక విలువలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..
లవంగాల్లో ఉండే పోషకాలు ఇవే..
లవంగాల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. లవంగాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఆహారల్లో రెగ్యులర్‌గా లవంగాలను ఉపయోగించడం వల్ల వాపు సంబంధిత ఆర్థరైటిస్‌ను నయం చేయడంలోనూ సహాయపడుతుంది.
పంటి నొప్పి
పంటి నొప్పికి లవంగాలు చక్కని పరిష్కారం చూపుతాయి. లవంగాలలో ఉండే యూసిన్ అనే సమ్మేళనం సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. ఇది యాంటిసెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే రెండు లవంగానలు నోట్లో వేసుకుంటే చెడు బ్యాక్టీరియాతో పోరాడటమేకాకుండా దంత కుహర సమస్యను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
అజీర్తి సమస్యలు పరార్
లవంగాలలో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాలు జీర్ణాశయంలోని అవాంఛిత బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. అంతేకాకుండా లవంగాల్లోని కార్మినేటివ్ లక్షణాలు.. గ్యాస్, ఉబ్బరం నివరణకు, జీర్ణక్రియ మెరుగుదలకు సహాయపడతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది..
లవంగాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణ చేస్తుందట.
రోగనిరోధకత పెంపు
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాల్లో లవంగాలలో లవంగలు ఒకటి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంటు వ్యాధులను నివారిస్తుంది. లవంగాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది రక్త నాళాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటిల్లోని మాంగనీస్, విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. అందుకే మధ్య వయస్కులు, వృద్ధులు ఆహారంలో లవంగాలను చేర్చుకోవడం చాలా అవసరం. దగ్గు, జలుబును నయం చేసే లక్షణాలు లవంగాలు కలిగి ఉంటాయి. జలుబు చేసినప్పుడు శ్వాసకోశ నాళాలు బ్లాక్ అయితే వాయుమార్గాలు తెరచుకునేలా చేయడంతోపాటు.. సులభంగా శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.