IRCTC Tours: ప్రకృతి వరప్రదాయిని కేరళను చూసొద్దాం రండి.. హైదరాబాద్ నుంచి విమానంలో ప్రయాణం.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవి..
ఎంచక్కా కుటుంబంతో టూర్ వెళ్లి రావడానికి ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీను తీసుకొచ్చింది. కల్చరల్ కేరళ పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజీలో కొచ్చి, మున్నార్, అలెప్పీ, త్రివేండ్రంలోని పర్యాటక ప్రాంతాలు చుట్టేసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి విమానంలో తీసుకెళ్లి తీసుకొచ్చే ఈ టూర్ ఆరు రాత్రుళ్లు, ఏడు పగళ్లు కొనసాగుతుంది. వచ్చే అక్టోబర్ 2వ తేదీన మరో బ్యాచ్ ను తీసుకెళ్లేందుకు ఐఆర్ సీటీసీ ప్రకటనను విడుదల చేసింది.
ప్రకృతి అందించిన వర ప్రసాదాల్లో కేరళ కూడా ఒకటి. అక్కడి అందాలను చూడాలే గానీ వర్ణించలేం. కాలువల ఒంపుసొంపులు, పచ్చని చెట్ల సోయగాలు, తేయాకు తోటల అందాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. చాలా మంది అక్కడి వెళ్లాలను అనుకుంటారు గానీ ప్లానింగ్ లేకపోవడం, అక్కడ ఏమి తెలీదన్న భయం వెంటాడటం లేక ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో వెనుకడుగు వేస్తారు. అయితే అలాంటి దిగులు ఏమి లేకుండా ఎంచక్కా కుటుంబంతో టూర్ వెళ్లి రావడానికి ఐఆర్‌సీటీసీ టూరిజమ్ అద్భుతమైన ప్యాకేజీను తీసుకొచ్చింది. కల్చరల్ కేరళ పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజీలో కొచ్చి, మున్నార్, అలెప్పీ, త్రివేండ్రంలోని పర్యాటక ప్రాంతాలు చుట్టేసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి విమానంలో తీసుకెళ్లి తీసుకొచ్చే ఈ టూర్ ఆరు రాత్రుళ్లు, ఏడు పగళ్లు కొనసాగుతుంది. వచ్చే అక్టోబర్ 2వ తేదీన మరో బ్యాచ్ ను తీసుకెళ్లేందుకు ఐఆర్ సీటీసీ ప్రకటనను విడుదల చేసింది. ఈ కల్చరల్ కేరళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
టూర్ షెడ్యూల్ ఇది..
- ప్యాకేజీ పేరు: కల్చరల్ కేరళ(ఎస్ హెచ్ఏ35)
- వ్యవధి: ఆరు రాత్రుళ్లు, ఏడు పగళ్లు
- ప్రయాణ సాధనం: విమానం(హైదరాబాద్ నుంచి)
- ప్రయాణ తేదీ: 2023, అక్టోబర్ 02, 08 తేదీల్లో
- సందర్శించే ప్రాంతాలు: అల్లెప్పీ, కొచ్చి, మున్నార్, త్రివేండ్రం
- ప్రయాణ చార్జీ: రూ. 35,600 నుంచి ప్రారంభం
పర్యటన సాగుతుందిలా..
డే1(హైదరాబాద్ నుంచి కొచ్చి): ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరి కొచ్చికి చేరుకుంటారు. అక్కడ మిమ్మల్సి ఐఆర్ సీటీసీ సిబ్బంది రీసీవ్ చేసుకొని హోటల్ కి తీసుకెళ్తారు. హోటల్లో బ్రేక్ ఫాస్ చేశాక.. యూదుల ప్రార్థనా మందిరం, డచ్ ప్యాలెస్, చైనీస్ ఫిషింగ్ నెట్‌లను సందర్శిస్తారు. సాయంత్రం మెరైన్ డ్రైవ్‌ను ఆస్వాదించవచ్చు. రాత్రికి కొచ్చిలోనే రాత్రి భోజనం చేసి హోటల్లోనే బస చేస్తారు.
డే2(కొచ్చి-మున్నార్): ఉదయం అల్పాహారం తీసుకున్నాక కొచ్చి నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న మున్నార్ కి ప్రయాణమవుతారు. మధ్యలో చీయపారా వాటర్ ఫాల్స్ ను సందర్శిస్తారు. మున్నార్ లో టీ మ్యూజియాన్ని సందర్శిస్తారు. రాత్రికి అక్కడే భోజనం చేసి బస చేస్తారు.
డే3(మున్నార్): అల్పాహారం చేశాక మున్నార్ చూసేందుకు బయటు వెళ్తారు. మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్, కుండ్లా డ్యామ్ లను సందర్శిస్తారు. రాత్రికి అక్కడే భోజనం చేసి బస చేస్తారు.
డే4(మున్నార్-తేక్కడి): అల్పాహారం చేశాక మున్నార్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేక్కడికి బయలు దేరుతారు. అక్కడ స్పైస్ ప్లాంటేషన్లను సందర్శిస్తారు. రాత్రికి అక్కడే భోజనం చేసి బస చేస్తారు.
డే5(తేక్కడి-అలెప్పీ/కుమారకోమ్): ఉదయం అల్పాహారం చేశాక తేక్కడి నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలెప్పీ/కుమారకోమ్ కు బయలుదేరుతారు. అక్కడి బ్యాక్ వాటర్స్ రైడ్ ఆస్వాదించవచ్చు. రాత్రి భోజనం చేసి అక్కడే బస చేస్తారు.
డే6(అలెప్పీ-త్రివేండ్రం): అలెప్పీ నుంచి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న చడియమంగళం ప్రాంతానికి బయలుదేరుతారు. అక్కడ జటాయు ఎర్త్ సెంటర్‌ని సందర్శిస్తారు. ఆ తర్వాత త్రివేండ్రం చేరుకొని హోటల్ కు వెళ్తారు. త్రివేండ్రంలో బస చేస్తారు.
డే7(త్రివేండ్రం – హైదరాబాద్): ఉదయాన్నే పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నానికి హోటల్లో చెక్ అయ్యి.. నేపియర్ మ్యూజియాన్ని సందర్శస్తారు. సాయంత్రం హైదరాబాద్ విమానంలో తిరుగుపయనం అవుతారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా..
హోటల్ రూంలో సింగిల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ. 52,800 చార్జ్ చేస్తారు. అదే డబుల్ షేరింగ్ అయితే రూ. 38,500, ట్రిపుల్ షేరింగ్ అయితే ఇద్దరికి రూ. 35,600 తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ కావాలనుకుంటే రూ. 25,750, బెడ్ అవసరం లేకపోతే రూ. 25,750 తీసుకుంటారు. అదే రెండు నుంచి నాలుగేళ్ల పిల్లలకు అయితే రూ. 15550 చార్జ్ చేస్తారు.
ప్యాకేజీలో కవర్ అయ్యేవి..
విమాన టికెట్లు, అల్పాహారం, రాత్రి భోజనాలు సమకూరుస్తారు. మధ్యాహ్నం భోజనం పర్యాటకులే చూసుకోవాల్సి ఉంటుంది. స్థానికంగా ప్రయాణాలకు ఏసీ బస్సు ఉంటుంది. ట్రావెల్ ఇన్సురెన్స్ కల్పిస్తారు. పర్యటన సమయంలో టూర్ ఎస్కార్ట్ సేవలందిస్తారు. అయితే సందర్శనా స్థలాలు, దేవాలయాల్లో అన్ని ప్రవేశ టికెట్లు పర్యాటకులే చూసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఐఆర్ సీటీసీ టూరిజమ్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి టూర్ ప్యాకేజెస్ విభాగంలో కల్చరల్ కేరళ ప్యాకేజీ వివరాలను తనిఖీ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..