AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: లవంగాలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదా ?

వంటింటిలోని పొపు డబ్బాల్లో లంగాలు ఒకటి. లవంగాలను మనం అనేక వంటకాల్లో ఉపయోగిస్తాం. ముఖ్యంగా మసాలాలతో చేసే వంటలు, నాన్ వెజ్ వంటల్లో లవంగాలు ఉండాల్సిందే. ఆయుర్వేదంలో లవంగాలను ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. ఇది శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో బయోయాక్టివ్ గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని రోజూ వాడాలి. కానీ మోతాదుకు మించి వాడకూడదు. రోజుకి 1 లేదా 2 లవంగాలు తింటే.. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో..

Kitchen Hacks: లవంగాలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదా ?
Cloves
Chinni Enni
| Edited By: |

Updated on: Aug 27, 2023 | 12:30 PM

Share

వంటింటిలోని పొపు డబ్బాల్లో లంగాలు ఒకటి. లవంగాలను మనం అనేక వంటకాల్లో ఉపయోగిస్తాం. ముఖ్యంగా మసాలాలతో చేసే వంటలు, నాన్ వెజ్ వంటల్లో లవంగాలు ఉండాల్సిందే. ఆయుర్వేదంలో లవంగాలను ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. ఇది శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో బయోయాక్టివ్ గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని రోజూ వాడాలి. కానీ మోతాదుకు మించి వాడకూడదు. రోజుకి 1 లేదా 2 లవంగాలు తింటే.. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

విష పదార్థాలను తొలగిస్తాయి: ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ గుణాలు, విటమిన్ C కూడా ఉంటుంది. శరీరంలో విష వ్యర్థాలను తొలగిస్తాయి. ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.

కీళ్ల నొప్పులకు చెక్: లవంగాలలో ఉండే యూజెనాల్ అనే తైలం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు రెగ్యులర్ గా లవంగాలను వాడటం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఈ తైలం చిగుళ్లపై యాంటిసెప్టిక్ లా పనిచేసి.. వాటిని కాపాడుతుంది. హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది.

ఇవి కూడా చదవండి

పొట్ట అంతా క్లీన్: రోజూ లవంగాలను కనీసం ఒక్కటైనా తింటే.. ఇవి పొట్ట లోపల అంతా క్లీన్ చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, పొట్ట ఉబ్బరం, అజీర్తిని తగ్గిస్తాయి. జీర్ణరసాలు ఊరేలా చేస్తాయి.

షుగర్ లెవల్స్ కంట్రోల్: లవంగాలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను బాగా కంట్రోల్ లో ఉంచుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్సులిన్ ను ఉత్పత్తిచేసి టైప్ 2 డయాబెటీస్ రాకుండా పనిచేస్తాయి.

గుండెను కాపాడతాయి: లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బీపీని తగ్గిస్తాయి. రక్తనాళాలు బాగా పనిచేసేలా చేస్తాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఎముకలు బలంగా: ఎముకలను బలంగా ఉంచడంలోనూ లవంగాలు ఉపయోగపడుతాయి. వీటిలో ఉండే మాంగనీస్, విటమిన్ K ఎముకలను బలంగా ఉంచుతాయి. ఎముకలలో మినరల్స్ బాగా ఉండేలా చేస్తాయి.

టెన్షన్ ను తగ్గిస్తుంది: లవంగాల్లోని యూజెనాల్ ఆయిల్.. బ్రెయిన్ కణాలకు టెన్షన్ తగ్గిస్తాయి. బ్రెయిన్ హీటెక్కకుండా, నాడీ సంబంధవ్యాధులు రాకుండా నిరోధిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి