AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ప్రతి రోజు నిద్రలేవగానే ఇలా చేయండి.. రోజంతా హుషారుగా ఉంటారు..!

ప్రతి రోజు ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలి. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు మంచి పోషకాలున్న ఆహారం, వ్యాయమం చేయడం ఎంతో మంచిది. దీని వల్ల రోజంతా హుషారుగా ఉంటాము. ఉదయం నిద్రలేవగానే ఫోన్లకు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకు దూరంగా..

Health Tips: ప్రతి రోజు నిద్రలేవగానే ఇలా చేయండి.. రోజంతా హుషారుగా ఉంటారు..!
Health Tips
Subhash Goud
|

Updated on: May 28, 2023 | 7:00 AM

Share

ప్రతి రోజు ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలి. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు మంచి పోషకాలున్న ఆహారం, వ్యాయమం చేయడం ఎంతో మంచిది. దీని వల్ల రోజంతా హుషారుగా ఉంటాము. ఉదయం నిద్రలేవగానే ఫోన్లకు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఇవి మన మూడ్‌ను మారుస్తాయి. అందుకే ఉదయం నిద్రలేవగానే వాటి జోలికి వెళ్లకూడదంటున్నారు.

  1. నిద్రలేవగానే 20 సెకన్ల పాటు అద్దంలో మీ ముఖాన్ని చూసుకోండి: నిద్రలేవగానే ఏదైనా ఒక జోక్‌ చదవండి. తర్వాత మీ ముఖాన్ని అద్దంలో 20 సెకన్ల పాటు చూసుకొని నవ్వండి. నిద్రలేవగానే వెంటనే ఇంట్లో అందరికీ, కుదిరితో పక్కనున్న వారికి గుడ్‌మార్నింగ్‌ చెప్పండి. ఇది మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచేలా చేస్తుంది. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని కూర్చోని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియ మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది.
  2. నిద్రలేవగానే నిమ్మకాయ నీళ్లు.. రిలాక్సేషన్‌ కోసం నిద్రలేవగానే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకుపోయి శరీరం శుద్ది అవుతుంది.
  3. పండ్లతో హుషారు.. అలాగే ఉదయం పూట పండ్లను తింటే ఎంతో మేలంటున్నారు. పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్‌, ప్రోటీన్స్‌ వ్యాధి నిరోధకశక్తిని పెంచి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. ముఖ్యంగా పండ్లను ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని హుషారుగా ఉంచుతాయి.
  4. త్వరగా లేవడం ఆరోగ్యానికి మంచిది.. చాలా మంది ఉదయం చాలా ఆలస్యంగా లేచే అలవాటు ఉంటుంది. ఉదయం త్వరగా లేచే అలవాటు ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ప్రతి రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. ఉదయాన్నే మేల్కొవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు కావడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. అలాగే సూర్యరశ్మి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. నిద్ర లేచిన తర్వాత వ్యాయమం.. నిద్రలేచిన తర్వాత వ్యాయమం చేయడం మీ అలవాట్లలో లేకపోయినట్లయితే ఆ అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. రోజు హాయిగా ఉండడానికి ఉదయం పూట మీకు నచ్చిన సంగీతాన్ని వినండి. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది. అంతేకాకుండా మన మూడ్‌ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది. అలా ప్రతి రోజు నిద్రలేవగానే ఇలాంటివి చేస్తే హుషారుగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..