AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: నెయ్యి, పెరుగు తింటే బరువు పెరుగుతారా? సన్నబడాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందేనా? నిపుణులు ఏమంటున్నారంటే?

బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారిలో చాలామందికి ఆహారం విషయంలో కొన్ని అపోహలున్నాయి. ఏం తినాలి? ఏం తినకూడదు అనే విషయంలో గందరగోళానికి గురువుతున్నారు.

Weight Loss: నెయ్యి, పెరుగు తింటే బరువు పెరుగుతారా? సన్నబడాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందేనా? నిపుణులు ఏమంటున్నారంటే?
Weight Loss
Basha Shek
|

Updated on: Oct 16, 2022 | 3:53 PM

Share

విపరీతమైన పని ఒత్తిడికి తోడు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది అదనపు బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యంలో బరువు తగ్గేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. జిమ్‌కు వెళ్లడం, శారీరక వ్యాయామాలు చేయడం, డైటింగ్‌ అంటూ రకరకాల పద్ధతులను అవలంభిస్తున్నారు. అయితే బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారిలో చాలామందికి ఆహారం విషయంలో కొన్ని అపోహలున్నాయి. ఏం తినాలి? ఏం తినకూడదు అనే విషయంలో గందరగోళానికి గురువుతున్నారు. బరువు తగ్గడానికి తేలికైన ఆహారం తీసుకోవడం చాలాముఖ్యం. అలాగే తక్కువ కేలరీలు, వ్యాయామం, సరైన నిద్ర పోవడం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే, మీ ఆహారంలో నెయ్యి తీసుకోకూడదని చాలా మంది చెప్పడం మీరు వినే ఉంటారు. నెయ్యిలో కొవ్వు ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నించినప్పుడు చాలా మంది నెయ్యికి దూరంగా ఉంటారు. అయితే బరువు తగ్గాలంటే నెయ్యి వదులుకోవడం నిజంగా అవసరమా? అలాగే బరువు తగ్గాలనుకునే చాలా మంది కార్బోహైడ్రేట్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా అన్నం ముట్టరు. మరి ఇవన్నీ నిజమేనా? నెయ్యి, అన్నంతో బరువు పెరుగుతామా?లేదా? అన్నది తెలుసుకుందాం రండి.

నెయ్యితో బరువు పెరుగుతారా?

ఆయుర్వేదం ప్రకారం, బరువు తగ్గే సమయంలో నెయ్యిని వదులుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇది బరువు తగ్గడానికి సరైన ఆహారం. ముఖ్యంగా జీర్ణక్రియకు బాగా తోడ్పడుతుంది. నెయ్యి మన శరీరానికి అవసరమైన కొవ్వు. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆవు నెయ్యి అయితే మరీ మంచిదంటున్నారు నిపుణులు.

అన్నం తినకపోతే సన్నబడతారా?

బరువు తగ్గాలంటే అన్నం వదులుకోవాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఎంత మేర రైస్‌ తీసుకున్నారు? అందులో ఏ మేర పోషకాలు ఉన్నాయన్నది చాలా ముఖ్యం. బియ్యంలో మంచి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి.

ఇవి కూడా చదవండి

పెరుగుతో బరువు పెరుగుతారా?

పెరుగు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే రోజూ పెరుగు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది. ఎందుకంటే జీర్ణం కావడం చాలా కష్టం. పెరుగు లక్షణాలు కఫ దోషాన్ని పెంచుతాయి. ఇది బరువు పెరుగుటకు దారితీస్తుంది.

వ్యాయామంతో..

అలాగే సన్నబడటానికి ఎక్కువ వ్యాయామం చేయవలసిన అవసరం లేదు. త్వరగా బరువు తగ్గడానికి చాలా వ్యాయామాలు చేస్తే, బరువు తగ్గడం కంటే అలసట పెరుగుతుంది. బరువు తగ్గడంపై మాత్రమే దృష్టి పెట్టవద్దు. బరువు తగ్గడానికి నిద్రను త్యాగం చేయవద్దు. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ