AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఎంతకు తెగించార్రా.. టెన్త్ స్టూండెట్‌ను ట్రాప్ చేసిన ఫిజిక్స్ టీచర్.. పేరెంట్స్‌కు తెలియకుండా..

ఈ మధ్య కాలంలో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే మతితప్పి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులకు మాయమాటలు చెప్పి వాళ్లను ట్రాప్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మేడ్జల్ జిల్లాలో వెలుగు చూసింది. పోచారం పీఎస్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి టెన్త్‌ క్లాన్ విద్యార్థిని ట్రాప్ చేసి, మాయమాలు చెప్పి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదురు టీచర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

Hyderabad: ఎంతకు తెగించార్రా.. టెన్త్ స్టూండెట్‌ను ట్రాప్ చేసిన ఫిజిక్స్ టీచర్.. పేరెంట్స్‌కు తెలియకుండా..
Teacher Minor Marriage
Anand T
|

Updated on: Feb 10, 2026 | 12:59 PM

Share

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్ మాయమాటలు చెప్పి ఓ టెన్త్‌ క్లాస్ విద్యార్థిని రహస్యంగా పెళ్లి చేసుకున్న ఘటన మేడ్చల్‌ జిల్లా పోచారం పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన టీచర్ పిల్లల జీవితాలతో ఆడుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుతు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం పీఎస్ పరిధిలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అదే స్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థినిపై కన్నేశాడు. విద్యార్థినికి మాయమాటలు చెప్పి, ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఎవరికీ తెలియకుండా బాలికను బయటకు తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఇటీవల బాలిక మెడతో పుసుపు తాడును గమనించిన తల్లి ఇదేంటని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి గట్టిగా బాలికను నిలదీయడంతో జరిగిన విషయాన్ని మొత్తం బాలిక తల్లితో చెప్పేసింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలిక తల్లిదండ్రులు వెంటనే స్కూల్‌కు చేరుకొని ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఇదేంటని స్కూల్ నిర్వాహకులను నిలదీశారు. అయితే స్కూల్‌ యాజమాన్యం సైతం నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడంతో బాధిత తల్లిదండ్రులు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదురు టీచర్‌ను అదుపులోకి తీసుకొని అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us