AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏముంది మావ ఈ పాట.. వింటున్న కొద్ది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. యూట్యూబ్‏లో 37 మిలియన్ వ్యూస్‏తో దుమ్మురేపుతుంది..

ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ఓ స్థాయిలో దూసుకుపోతున్నాయో చెప్పక్కర్లేదు. కనీసం వారానికి రెండు మూడు కొత్త పల్లె పాటలు యూట్యూబ్ లో విడుదలవుతున్నాయి. కానీ కొన్ని పాటలు మాత్రం సంవత్సరాలు గడిచినప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఒక పాట మాత్రం నెట్టింట దూసుకుపోతుంది.

ఏముంది మావ ఈ పాట.. వింటున్న కొద్ది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. యూట్యూబ్‏లో 37 మిలియన్ వ్యూస్‏తో దుమ్మురేపుతుంది..
Neelaveni Song
Rajitha Chanti
|

Updated on: Jun 13, 2026 | 1:50 PM

Share

‏ప్రస్తుత డిజిటల్ యుగంలో జానపద గీతాలకు సరికొత్త క్రేజ్ లభిస్తోంది. మట్టి వాసన, స్వచ్ఛమైన భావోద్వేగాలతో సాగే తెలంగాణ ఫోక్ సాంగ్స్ ను యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల విడుదలై, సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ ఫోక్ సాంగ్ ‘నీలవేణి’ (Neelaveni). ఇంద్రజిత్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ పాట యూట్యూబ్‌లో విశేషమైన వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ బ్యూటిఫుల్ ఫోక్ సాంగ్‌ను దిలీప్ దేవగన్ (Dilip Devgan) స్వయంగా రాయడమే కాకుండా, సింగర్ జయశ్రీతో కలిసి ఎంతో మధురంగా ఆలపించారు. జానపద శైలికి వెస్ట్రన్, మోడరన్ బీట్స్‌ను జోడించి ఇంద్రజిత్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఒక్కరూ లూప్‌లో వినేలా, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో ట్రెండ్ అయ్యేలా ఈ సాంగ్ ట్యూన్‌ను కంపోజ్ చేశారు. చిక్కు నంది అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చింది.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

‘లీడింగ్ బాయ్స్’ (శ్రీకాంత్) కొరియోగ్రఫీ, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వీడియో సాంగ్‌లో జనతా బబ్లు, మాధురి రాథోడ్ లీడ్ కాస్టింగ్‌గా నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, పల్లెటూరి వాతావరణంలో సాగే ప్రేమాయణం, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా మాస్ , క్లాస్ ఎలిమెంట్స్ రెండూ సమపాళ్లలో ఉండేలా ఈ పాటను విజువలైజ్ చేశారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

ట్రెడిషనల్ ఫోక్ టచ్ కోరుకునే వారితో పాటు ఈ తరం యువతను కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ఈ ‘నీలవేణి’ సాంగ్ తక్కువ సమయంలోనే మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పటివరకు ఈ పాట దాదాపు 37 మిలియన్ వ్యూస్ అందుకుంది. అంటే దాదాపు 3.7 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇంతకీ ఈ పాటను మీరు విన్నారా.. ?

ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..

నీలవేణి సాంగ్..

ఎక్కువమంది చదివినవి : Sridevi Vijaykumar : ఇప్పుడున్న హీరోలలో అతడంటే పిచ్చి ఇష్టం.. అతడే నా ఫేవరేట్.. హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్..

Follow Us