Cinema : మైండ్ బ్లాకింగ్ ట్విస్టులు.. 2 గంటలు నాన్‌స్టాప్ సస్పెన్స్.. ఓటీటీలో ఊపేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్..
క్లైమాక్స్ వరకు సీటు చివర కూర్చోబెట్టే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఇది. ప్రస్తుతం ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. ఊహించని మలుపులు, భయం పుట్టించే ట్విస్టులతో ఈ సినిమా సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ సినిమా ఏంటీ.. ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే విషయాలు తెలుసుకుందామా.

ఓటీటీ వేదికలలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కొదవే లేదు. ప్రతి క్షణం ట్విస్టులు, ఊపిరి బిగపట్టే సస్సెన్స్ ఉన్న సినిమాలు ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. అలాంటి వాటిలో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఒకటి. మనం మాట్లాడుకుంటున్న ఆ మూవీ పేరు అనోమీ. మలయాళంలో ఈ ఏడాది వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒకటి. డైరెక్టర్ రియాస్ మరాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాల్లో ఒకప్పటి హీరోయిన్ భావన, రెహ్మాన్ లు ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈసినిమాకు థియేటర్లలో అంతగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు ఇదే మూవీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంది. స్లోగా సాగుతున్నప్పటికీ దాదాపు 2 గంటలు ప్రేక్షకులను సీటు అంచున కూర్చొపెడుతుంది. ముఖ్యంగా సస్పెన్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి మంచి కిక్కిచ్చే సినిమా ఇది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటీ.. ఇప్పుడు లుక్సే ముఖ్యం.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్..
ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇది తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు. అయినప్పటికీ ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను సులభంగానే అర్థమవుతుంది. చాలా గ్రిప్పింగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సాగుతుంది. ప్రతి సీన్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఈ సినిమాలోని ప్రతి ట్విస్టు, సస్పెన్స్ ఊహించని విధంగా సాగుతూ ఉంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్.. ఎందుకు తీసానా అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నా.. డైరెక్టర్ వివి వినాయక్..
కథ విషయానికి వస్తే.. కనిపించకుండా పోయిన తన తమ్ముడి కోసం ఒక సిస్టర్ వెతికే అన్వేషణ ఇది. ఈ కేసు బాధ్యతను ఓ పోలీస్ అధికారికి అప్పగిస్తారు. అట పోలీసులు, ఇటు సిస్టర్ చేసే వ్యక్తిగత అన్వేషణ ఆసక్తికరంగా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ సాగుతున్న కొద్ది ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. క్షణ క్షణం ఉత్కంఠ, ఈ కేసుకు సంబంధించిన ట్విస్టులు బయటపడుతున్న కొద్ది ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తాయి. ఈ సినిమాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..
